DEPT. TESTS

          MOCK TEST  -4         MOCK TEST -5 (141)


E.O Test 141 ఫింఛన్ నిబంధనలు  బిట్లు...
HOW TO PREPARE GOT 88 DT  by s. kotaiah 

EO TEST 141 MATERIAL ( with out weter mark)

GO TEST 88  MATERIAL  (WITH OUT ANY WATER MARK)

GO TEST 97  - PART 1  PART -    (WITH OUT ANY WATER MARK)



FOR MORE METERIAL AND VEDEOS OF DEPT TESTS CLICK HERE



సందేహాలు - సమాధానాలు 
1.నా వయస్సు 55సం.లు. నేను స్కూల్ అసిస్టెంట్ గా 12సం.లు సర్వీసు పూర్తి చేసితిని.12సం.లు స్కేలు రావడానికి నేను EOT,GOT పరీక్షలు పాస్ అయ్యాను.నాకు12సం.లు ఇంక్రిమెంట్ ఏ తేదీ నుంచి ఇస్తారు?
        జవాబు  ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ లో 12 సం.లు పొందడానికి స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో EOT,GOT పరీక్షలు వ్రాసి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆఖరి పరీక్ష తేదీ నుండి వర్తింపచేయాలి.

2.నాకు 50 ఇయర్స్ దాటినవి.నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా?
జవాబు: G.O.Ms.No.93, Dt.03.04.2010 లో రెగ్యులర్ ప్రమోషన్ కి ఇచ్చిన రాయితీలు అన్నీ AASకు కూడా వర్తించునని పేర్కొనబడినది.అయితే ఆర్థికశాఖ వారి మెమో నెం.034408/248/PC-2/2011, Dt.02.04.2012 ద్వారా ఈ నిబంధనను నిరాకరిస్తూ వివరణ ఇచ్చినది.కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా 12సం.లు ప్రమోషన్ స్కేలు పొందడానికి EOT,GOT లలో ఉత్తీర్ణత కావలసియున్నది.

3.SGTలలో 50 సం.లు దాటినవారు EOT, GOT పాస్ కాకుండా 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?
జవాబు:కారు.వారు కూడా G.O.Ms.No.93,Dt.03.04.2010 ప్రకారం అందుకు సంబంధించిన విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి.

4.ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు ఏమైనా వున్నాయా?
 సమాధానం: ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది. SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.  SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు. పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.

5.నేనుsgt గా పనిచేస్తున్నాను.EOT,GOT పాస్ కాలేదునాకు 51 సంవత్సరంలు.నాకు ఇప్పుడు 24 ఇయర్స్ స్కేల్ ఇస్తారా?
జవాబు:  మీకు 50 ఇయర్స్ దాటినప్పటికీ 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వాలి అంటే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కావాలి.వాస్తవానికి PRC లో మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆర్ధిక శాఖ ఒప్పుకోలేదు.
 డిపార్ట్ మెంటల్ టెస్ట్  - ఆన్ లైన్ పరీక్షా విధానము   : -
 Ø అభ్యర్ధి గంట ముందుగా పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి
Ø పరీక్షా సమయానికి ౩౦ నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి
Ø రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాతఏ అభ్యర్ధిని లోపలికి అనుమతించరు
Ø మీకు కేటాయించబడిన సిస్టమ్ నందు పరీక్షల  లింక్ "లాగిన్ స్క్రీన్ " అందుబాటులో ఉంటుంది ..ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి  తెలియజేయాలి
Ø 10 నిమిషాల ముందు మీరు   "లాగిన్ " అవ్వాల్సి ఉంటుంది
                  లాగిన్   ఐడి  =  రోల్ నంబర్
                  పాస్ వర్డ్    =  పరీక్ష రోజు ఇవ్వబడుతుంది
Ø ఇన్విజిలేటర్ పాస్ వర్డ్ ను ఉదయం పరీక్షకు అయితే 8.50 నిమిషాలకు, మద్యాహ్నం అయితే  1.50 నిమిషాలకు ప్రకటిస్తాడు.
Ø ప్రశ్నలను , మరియు ఆప్షన్స్ ను కాపి చేయటం కాని నోట్ చేయటం కాని చేయకూడదు. అలా  చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును
Ø లాగిన్  అయిన తరువాత తెరపై  ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్  లో మీ వివరాలు చెక్ చేసుకొని Confirm  పై క్లిక్ చేయాలి.
Ø Detailed Exam Instructions వాటిని అర్ధం చేసుకొన్న తరువాత 
          I AM READY TO BEGEN పై క్లిక్ చేయాలి.
Ø ప్రశ్నల యొక్క జవాబులు గుర్తించటానికి  మౌస్ ను మాత్రమే వాడాలి
Ø ఈ ఆన్ లైన్  పరీక్ష నందు టైమర్ కనపడుతూ ఉంటుంది .ఇంకా ఎంత టైముందో  అది సూచిస్తుంది.
Ø మీ యొక్క  ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నల రంగు మారుతూ ఉంటుంది
                    White (Square)                    -  మీరు ప్రయత్నించని ప్రశ్నలు
                    Red(Inverted Pentagon)  -మీరు జవాబు ఇవ్వని ప్రశ్నలు
                    Green (Pentagon)                - మీరు జావాబులు పూర్తి  చేసిన ప్రశ్నలు
                    Violet  (Circle) -   ఆ ప్రశ్న చూసారు అయితే జవాబు తరువాత గుర్తిస్తారు                                                                      ( marked for Review)
                    Violet ( Circle with a Tick mark) - ఆ ప్రశ్నకు జవాబు గుర్తించార
                                                         కాని Review కొరకు మార్క్ చేశారు
Ø ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత  SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి . ఆ సమాదానం SAVE చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.
Ø Review & Next  బటన్ నొక్కిన  ఆప్రశ్న పరిశీలనకు ఉంచబడి తరువాత ప్రశ్న వస్తుంది
Ø ఒక ప్రశ్నకు జవాబు తేసేయాలని అనుకుంటే  CLEAR RESPONSE బటన్ పై నొక్కాలి
Ø SECTION NAME పై కర్సర్ ను ఉంచిన  ఆ సెక్షన్ నందు జవాబు గుర్తించినవి , ఇంకా జవాబు గుర్తించాల్సినవి, తరువాత పరిశీలనకు ఉంచినవి సూచిస్తుంది .
Ø ఒక వేళ మీరు అక్షరములు పెద్దవిగా చూడాలనుకుంటే.. ఇన్విజిలేటర్ అనుమతితో పైన ఉన్న ఫాంట్  సైజ్ ఎంపిక ఛేసుకొని పెద్దవిగా చూడవచ్చు.
Ø PWD అభ్యర్ధులకు  120 నిమిషముల తరువాత కూడా అదనంగా ఇంకో 20 నిమిషాలు SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది
Ø ఏ విధంగానైనా system log out   అయినా మనం ఇచ్చిన జవాబులన్నీ save అయి ఉంటాయి. ఏ టైమ్ లో పరీక్ష ఆగిపొయిందో ఆ టైమ్ నుండి మరలా మొదలవుతుంది.
Ø పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఒక షీట్ ఇవ్వబడుతుంది  దానిపై లాగిన్ ఐడి ,పాస్ వర్డ్ రాయాలి.
Ø ఎట్టి పరిస్థితిలో key board  ముట్టుకో రాదు .ముట్టుకుంటే ID lock అవుతుంది . అప్పుడు మీ ఇన్విజిలేటర్ సహాయం  తీసుకోండి.