పెన్షన్స్

                                FAMILY PENSION
 సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్యకు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు .
   7 సంవత్సరాల సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.

    7 సంవత్సరాల సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.
a) మొదటి 7 ఇయర్స్ కి 50%
b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.
Example 1:-
ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్
7740×30/100 =2322.00
ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.
Example 2:
ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్
11530×50/100=5765.00.
7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్ 11530×30/100 = 3459.00

CPS ఖాతాదారుడు తన ఖాతా నుండి డబ్బు ను తిరిగి పొందు విధానం (ఉపసంహరణ విధానం)
రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎస్.నెం-62 . తేది=07/03/2014 ఉత్తర్వుల ద్వారా ఖాతా దారుడు
1.స్వచ్ఛంద పదవి విరమణ.
2.పదవీ విరమణ
3.ఆకాలమరణం
ఈ మూడు సందర్భాలలో CPS ఖాతా నుండి డబ్బును తిరిగిపొందగలరు.

 స్వచ్ఛంద పదవీవిరమణ ::

ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తము నుండి 80 % ను నెలవారి పెన్షన్గా ఇవ్వడానికి A.S.Pలో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందజేస్తారు. 20%నిధి ని చెల్లిస్తారు.
*సూచన* :-- మొత్తం నిధి 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
దీనికోసం FORM 102-GP ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

సాధారణ పదవీ విరమణ:

ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్త0లో నుండి 40%ను నేలవారి పెన్షన్ గా ఇవ్వడానికి A.S.P లో ఎంచుకున్న రకానికి పెన్షన్ అందజేస్తారు. 60% నిధిని చెల్లిస్తారు.
*సూచన* :-
మొత్తం నిధి 2లక్ష లలోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
దీనికోసం FORM 101-GS ను పూర్తిచేసి సంబంధిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.
ఆకాలమరణం పొందిన సందర్భంలో :

ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం(100%) నిధిని నామినీ కి చెల్లిస్తారు

            పెన్షన్,  పెన్షన్ కమ్యూటేషన్:

  పెన్షన్ కమ్యూటేషన్:
వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును.* దీనినే*పెన్షన్ కమ్యూటేషన్* అంటారు.
( *G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999*)

 
        గమనిక:- *రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి.* సంవత్సరం దాటితే *మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది*
 పెన్షన్ ":-
పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు.
 పెన్షన్ లెక్కించు విధానము:  చివరి నెల వేతనం× అర్థ సంయూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు
 20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే 5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు
.
 కుటుంబ పెన్షన్ వివరాలు
  రిటైర్మెంట్ గ్రాట్యుటీ   ,మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:  5 ఇయర్స్
 ఫైనాన్షియల్ బెనిఫిట్: క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .
. డెత్ గ్రాట్యుటీ
0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు)
1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ )
5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38 /4 (చెల్లించాల్సిన రోజు)
మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది.
పెన్షన్ రకాలు
 పెంపొందించిన కుటుంబ పెన్షన్ :-
మిని క్వాలిఫైయింగ్ సర్వీస్: ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కాలానికి50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు.
 కుటుంబ పెన్షన్: -
మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:  ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%
 అదనపు సాధారణ కుటుంబ పెన్షన్:-    అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది,

గ్రాట్యుటీ,పెన్షన్ అనేవి ఉద్యోగి "ఆస్తి" అని సుప్రీం వ్యాఖ్య

                          జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన  జితేంద్ర కుమార్‌ శ్రీవాత్సవ అనే రిటైర్డు ఉద్యోగి తనకు రావాల్సిన పెన్షన్‌,గ్రాట్యుటీ విషయంపై హైకోర్టుకు వెళ్ళగా ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ జార్ఖండ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ జస్టీస్‌ కె.ఎస్‌.రాధాకృష్ణన్‌మరియు జస్టీస్‌ ఎ.కె. సిక్రీతో కూడిన ధర్మాసనం 20-08-2013 రోజున ఈ విధంగా స్పష్టం చేసింది...

పెన్షన్,గ్రాట్యుటీ అనేవి ఒక ఉద్యోగి శ్రమతో కూడబెట్టుకున్న 'ఆస్తి' లాంటివి...
 
ఈ'ఆస్తి'హక్కును లాగేసుకోవడం రాజ్యంగంలోని 300(ఎ) అధికరణకు విరుద్ధం...
"ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే కాగలదని,ఉద్యోగి పెన్షన్‌,గ్రాట్యుటీని నిలిపివేసే హక్కు ప్రభుత్వానికి లేదని ఇవి దాతృత్వంతో ఇచ్చే ప్రయోజనాలు కావని,ఒక ఉద్యోగి అంకిత భావంతో నిరంతరం శ్రమించి కూడ బెట్టుకొన్న ఆస్తి''* అని జస్టీస్‌ కె.ఎస్‌.రాధాకృష్ణన్‌,జస్టీస్‌ ఎ.కె.సిక్రీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

 సందేహాలు - సమాధానాలు 
1.కారుణ్య నియామక పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా?
జవాబు:కుటుంబ పెన్షన్ వస్తుంది.కాని G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు.అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది.
2. ఒక టీచర్ తేదీ 1.1.1998 నాడు నియామకం అయ్యారు. 31.12.2017 నాటికి 20 సర్వీస్ పూర్తి అయింది. అయితే, ఈ ఇరవై ఏళ్ళ సర్వీస్లో 3 సంవత్సరాలు మెడికల్ గ్రౌండ్స్ పై తీసుకున్న జీతనష్టపు అసాధారణ సెలవు ఉంది. సదరు టీచర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
జవాబు:  తీసుకోరాదు. 20 ఏళ్ళ నెట్ సర్వీస్ పూర్తిచేసి ఉండాలి. పెన్షన్ రూల్ 43 ప్రకారం ఒక ఉద్యోగి/టీచర్ 20 సర్వీస్ పూర్తిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలచినప్పుడు.... Study కోసం పొందిన జీతనష్టపు అసాధారణ సెలవు (OCL Loss of Pay)ను మాత్రమే క్వాలిఫయింగ్ సర్వీస్ గా పరిగణిస్తారు. మెడికల్ గ్రౌండ్స్ లేదా ప్రైవేట్ అఫైర్స్ పొందిన OCL LP ని క్వాలిఫయింగ్ సర్వీస్ గా పరిగణించరు.అయితే... సూపెరాన్యుయేషన్ (58/60 Years) తో రిటైర్ అయినప్పుడు మాత్రం.... మెడికల్ గ్రౌండ్స్ పై తీసుకున్న Unlimited Period మరియు ప్రైవేట్ అఫైర్స్ తో పొందిన 36 నెలల OCL Loss of Pay ని పెన్షన్ కు క్వాలిఫయింగ్ సర్వీస్ గా లెక్కిస్తారు.
3.20 ఇయర్స్ కి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ ఎంత వస్తుంది?
*జవాబు: చివరి ములవేతనం లో 37.87% పెన్షన్ గా వస్తుంది.
4. నా భార్య టీచర్.ఆమె మరణించి0ది.రిటైర్మెంట్ బెనిఫిట్ ఎవరు పొందుతారు?
జవాబు: భార్యాభర్తలు ఇద్దరూ టీచర్లు అయి, భార్య మరణించిన సందర్భంలో భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు & పెన్షన్ భర్త తీసుకోవచ్చు.అలా కాకుండా భార్య మరణించిన తరువాత సమర్పించే ఫారాలు లో నామినీ గా కొడుకు పేరు రాస్తే(కొడుకు కి 18 సంవత్సరం లు పైన ఉండాలి) భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు మొత్తం కొడుకు తీసుకుంటాడు
5. నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా?
జవాబు:వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51 తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.
6:   నేను 31.7.17న రిటైర్డ్ అవుతాను.నా ఇంక్రిమెంట్ నెల ఆగస్టు. నాకు ఇంక్రిమెంట్ ఇస్తారా?
జవాబు: జీఓ.235 తేదీ:27.10.1998 ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన మరుసటి రోజు గల ఇంక్రిమెంట్ పెన్షన్ కి లెక్కించబడుతుంది..
7:   నేను జులై 14 న ఉద్యోగం లో చేరాను.ఇంక్రిమెంట్ నెల జులై.నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను.పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి?
జవాబు: జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు.కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.
102 EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా?
జవాబు:EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.కానీ వ్యక్తిగత కారణాల తో eol ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా eol కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.
 


Read more: https://borrasrinivas.webnode.com/pension/

G.O.MS.No.47 Dt.20-4-2018 Gratuity and Family Pension Payment Guidelines to CPS Employees

PENSION FORMS
G.O.Ms.No.6 Dt.11-01-2017, Scrutinize the medical reimbursement bills through the Dr.NTR Vaidya seva Trust instead of Director of Medical Education, Pensioner                                                                                   
                

 OLD INFORMATION:-
SOFTWARE FOR :-( OLD)

GO.223 Calculation of Pension on Last Pay Drawn to the Employees retired prior to 25-10-98

 ONLINE APPLICATION FOR PENSION & GPF FINAL WITHDRAWAL

Service pension application form.

 PENSION SOFTWARE-R.Ramesh

Service pension application form.

 Pension Forms.

 CPS Application.doc (41 kB)

cps.doc                       


.