అమ్మ ఒడి ✤ విద్యార్థి వివరాల నమోదు విధానం :-
➸ Go to *https://jaganannaammavodi.ap.gov.in/* Here go to HM Login.
➸ Please enter the *Username and Password* and Click on Login.
➸ After LOGIN Please Click on the *SERVICES* Option in the Menu, then Please Click on the *S1- Student Details without Prepopulate Mother Data.*
➸ Here Please *SELECT* the *CLASS* and click on the Get Details.
➸ After that screen will be appear, then Please click on the *View Button* as you wish in the
*Students List.*
➸ If you Click on the *YES OPTION* in the screen Student Details will be appear in the POP-UP
Screen.
➸ Please Click on the *Services for S2-Student Registration form Details.*
➸ After Click on the *S2-Student Registration form* Details,Screen will be appear.
➸ Then please fill the details of all students. And please click on the *SUBMIT* button.
➸ After click on the *SUBMIT* button, details are *successfully uploaded.* And here *STUDENTS ID* will be generated.
*Source :- Rc No 242*
✤ *అధికారిక వెబ్సైట్* :- https://jaganannaammavodi.ap.gov.in/

ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019 తేది : 22.11.2019
- విషయం : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.
నిర్దేశములు :
- 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 79, తేది : 4.11.2019
- 2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 16.11.2019 ఆదేశములు
- 'జగనన్న అమ్మ ఒడి' కార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను సిద్ధం చేసేందుకు పై సూచిక 2లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
- పరిపాలన సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని, పై సూచిక 2 లోని ఆదేశములకు కొనసాగింపుగా ఈ దిగువ సూచనలను ఇవ్వడమైనది.
- పై సూచిక 1లోని ఆదేశాలను అనుసరించి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 17.11.2019 నుండి 21.11.2019 మధ్య కాలంలో తమ తమ పాఠశాలలోని విద్యార్థుల వివరములను చైల్డ్ ఇన్ఫోనందు నమోదు/ నవీకరణ చేయడమైనది.www.apteachers.in ఆ విధంగా చైల్డ్ ఇన్ఫోలోని విద్యార్థుల వివరములు 21.11.2019న ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారికి అందించడమైనది.
- ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా తల్లుల లేదా సంరక్షకుల వివరాలను జతపరచటం 1. ఎపి ఆన్ లైన్ ద్వారా తమకు అందిన చైల్డ్ ఇన్ఫోను ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు రేషన్ కార్డుల జాబితాతో మరియు ప్రజాసాధికార సర్వే సమాచారంతో సరిపోల్చి తెల్ల రేషన్ కార్డులో ఉన్న తల్లుల లేదా సంరక్షకుల వివరాలను సేకరించి ఆ మొత్తం సమాచారాన్ని ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు విద్యార్థి వారీగా అనుసంధానం చేస్తారు.
- 2. ఈ కార్యక్రమం 23.11.2019 నాటికి పూర్తి చేసి ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు ప్రతి ప్రధానోపాధ్యాయుడికి 'లాగ్ ఇన్ ఐడి' మరియు 'పాస్ వర్డ్ ద్వారా 24.11.2019న అందచేస్తారు.
- 3. ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు ప్రధానోపాధ్యాయుడికి అందచేసే ఈ సమాచారం పాఠశాలలోని తరగతి విద్యార్థుల వారీగా ఉంటుంది.
- 4. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా అందిన వివరాలను సరిపోల్చుకొనుట, నమోదు చేయుట మరియు ధృవీకరించుకొనుటకు విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల పేరు, ఆధార్ నంబరు మరియు బ్యాంకు ఆ 'హార్డ్ కాపీ'లను సంబంధిత విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ తమ మండల విద్యాశాఖాధికారికి నేరుగా అందచేయాలి. ఖాతా వివరములను 24.11.2019 లోపు సేకరించి, ఆన్ లైన్ లో నమోదు చేయుటకు సిద్ధంగా ఉండవలెను.
ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా అందిన వివరాలను సరిపోల్చుకొనుట, నమోదు చేయుట మరియు ధృవీకరించుకొనుట.
- 5. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా తమకు అందిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. తరగతి వారీగా విద్యార్థుల వివరములు సరిపోల్చుకుంటూ వారి తల్లి/ సంరక్షకుడు వివరములను (తల్లి/ సంరక్షకుని పేరు, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా వివరములు) నమోదు చేయాలి. ఒకవేళ ఆ వివరములన్నీ ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా తమకు అందిన సమాచారంలో ముందుగానే పొందుపరచి ఉంటే వాటిని ధృవీకరించుకోవాలి. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవాలి. (వాడుక సూచికను జతపరచడమైనది) ఆ విధంగా వివరములు నమోదు పరిచిన తరువాత విద్యార్థుల స్వగ్రామాల మరియు మండలాల వారీగా సంబంధిత విద్యార్థుల మరియు తల్లులు/ సంరక్షకుల జాబితాను సదరు మండల విద్యాశాఖాధికారికి పంపవలసి ఉంటుంది.
- 6. 100 లోపు విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 25.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి. 101 నుండి 300 లోపు విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 26.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి. 300 లకు పైగా విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 27.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి.www.apteachers.in ప్రధానోపాధ్యాయుడు ధృవీకరించిన సమాచారం వారివారి స్వగ్రామానికి సంబంధించిన మండల విద్యాశాఖాధికారికి స్వయంచాలకంగా (ఆటోమేటిగ్గా) చేరుతుంది.
గ్రామాల వారీగా జాబితాలను ముద్రించి క్షేత్ర పరిశీలనకు పంపడం
- 7. ఆ విధంగా మండల విద్యాశాఖాధికారి వారికి రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి ఆ మండలంలోని గ్రామాలకు సంబంధించిన విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల వివరములు చేరుతాయి. మండల విద్యాశాఖాధికారి తమకు చేరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి సిబ్బంది ద్వారా గ్రామాల వార్డులు వారీగా జాబితాలను ముద్రించి సంబంధిత గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకునికి అందజేయాలి. ఒకవేళ గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు అందుబాటులో లేని యెడల ఆ గ్రామ జాబితాలను సంబంధిత క్లస్టర్ రిసోర్సు పర్సను అందజేయాలి.
క్షేత్రస్థాయి పరిశీలన
- 8. గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ మండల విద్యాశాఖాధికారి ద్వారా తనకందిన జాబితాలను సంబంధిత గ్రామ, వార్డు వాలంటీర్లకు అందచేయాలి. వారి ద్వారా ఆ సమాచారాన్ని ఆయా కుటుంబాలకు వివరించి తద్వారా ఆ సమాచారంలో లేని వివరాలు అనగా తల్లుల పేర్లు, తెల్ల రేషను కార్డు వివరాలు, ఆధార్ నెంబరు, బాంకు అకౌంటు నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడు నెంబరు మొదలైన వివరాలను సేకరించాలి. ఆ సమాచారంలో తెల్ల రేషను కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద | అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునో కాదో ఆరు అంచెల పరిశీలన (సెక్స్ స్టెప్ వాలిడేషన్) ద్వారా ధృవీకరించుకోవాలి. ఈ కార్యక్రమమంతా 30.11.2019 లోపు పూర్తి చేయాలి.
- 9. ఆ విధంగా గ్రామ/ వారు వాలంటీర్లు క్షేత్రస్థాయిలో నమోదు చేసిన/ ధృవీకరించిన సమాచారాన్ని అనగా ఆ 'హార్డ్ కాపీ'లను సంబంధిత విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ తమ మండల విద్యాశాఖాధికారికి నేరుగా అందచేయాలి.
- 10. తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ఉత్తర్వులు తదుపరి కార్యావర్తనముల ద్వారా తెలియజేయబడతాయి.
- 11. రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లు, డివిజనల్, మండల విద్యాశాఖాధికార్లు, క్లస్టర్ రిసోర్సు పర్సన్లు మరియు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర స్థాయి పరిశీలకులు పూర్తి శ్రద్ధతో పై విధి విధానాలను అత్యంత జాగరూకతతో అమలుచేయవలసినదిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది
జగనన్న అమ్మ ఒడి
(GO.MS.No 79, Dt.4-11-2019)
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరిట “జగనన్న అమ్మ ఒడి” కార్యక్రమం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కులం ,మతం, ప్రాంతం తో సంబంధం లేకుండా దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి తల్లికి లేదా తల్లి లేనప్పుడు గుర్తింపు పొందిన సంరక్షకులకు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం అయినా నవరత్నాల లో భాగంగా ప్రారంభించబడుతుంది .2019 20 విద్యాసంవత్సరంలో గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, జూనియర్ కళాశాలలో ఇది అమలు చేయబడుతుంది.
జగనన్న అమ్మవడి విధానం మార్గదర్శకాలు అర్హతలు:-
1. ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లులకు లేదా సంరక్షకులకు కుటుంబంలోని పిల్లల సంఖ్యతో నిమిత్తం లేకుండా సంవత్సరానికి 15000 రూపాయలు అందించబడుతుంది .
2.పిల్లల తల్లి లేదా సంరక్షకుల పేరిట ప్రభుత్వం జారీ చేసిన వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి 3.తల్లి లేదా సంరక్షకులు గారు చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డును కలిగి ఉండాలి
4. పిల్లలు ఆధార్ కార్డు కలిగి ఉండాలి లబ్ధిదారుని అనుమతితో ఆ ఆధార్ కార్డు సేకరించబడుతుంది
5 తల్లి మరణించిన లేకపోయినా సందర్భాలు పిల్లల సహజ సంరక్షకుని 15000 రూపాయలు చెల్లించబడతాయి .
6.పిల్లల తల్లి లేదా సంరక్షకుల వివరాలు, రేషన్ కార్డ్ ఆరు దశల్లో ధ్రువీకరణ చేస్తారు
7. లబ్ధిదారుని పిల్లలు ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ ,ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్ ,జూనియర్ కాలేజీలు లో చదువుతూ ఉండాలి
8. సంబంధిత శాఖలును సంప్రదించిన తర్వాత ఈ పథకము స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రవేశం పొందిన అనాధలు /వీధి బాలలు కూడా విస్తరించి పడుతుంది
9.పిల్లల కనీస హాజరు 75% ఉండాలి
10.పిల్లలు విద్యా సంవత్సరం మధ్యలో బడి మానివేసిన నట్లయితే ఈ పథకం వారికి వర్తించదు
11. ఈ పధకం కింద తల్లులకు ప్రోత్సాహకం మంజూరు కోసం ఒకటి నుండి పన్నెండు తరగతుల అర్హత గల సంస్థలలో చదువుతున్న విద్యార్ధులు లబ్దిదారుని గుర్తించటానికి ఒకే సమిష్టి వ్యవస్థను తీసుకురావాలి
12. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ పథకం వర్తించదు
చెల్లింపు విధానము:
1. ప్రతి లబ్దిదారునికి లేదా తల్లికి ఏదైనా జాతీయ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి
2.పిల్లలు తమ విద్యను 12వ తరగతి వరకు కొనసాగించే వరకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో లబ్ధిదారునికి ఖాతా కు 15000 రూపాయలు ఆన్లైన్ ద్వారా బదిలీ చేయబడుతుంది. 3.పన్నెండో తరగతి పూర్తయిన తర్వాత ఈ ఆర్థిక సహకారం కొనసాగించబడదు
పర్యవేక్షణ విధానం : -
1.దీనికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించబడుతుంది. అది కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ కు లింక్ ఇవ్వబడుతుంది.
2. విద్యా సంస్థలు సంస్థల ప్రధాన అధిపతి (Head of the Department) సమర్పించిన డేటా ప్రొఫార్మా లో సూచించిన పేరు, వయసు ,కులం, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ , మొదలైన అన్ని వివరాలు సివిల్ సప్లై, చైల్డ్ ఇన్ఫో / U DISE డేటా మరియు ఇతర విభాగాల ధ్రువీకరణ ఆధారంగా జగనన్న అమ్మ ఒడి సహాయం విడుదలవుతుంది.
3. జగనన్న అమ్మ ఒడి సహాయం చెల్లింపు కోసం ఇచ్చిన వివరాలను ఆ సంస్థపై ఉన్న తక్షణ తనిఖీ అధికారి (Immediate inspecting officer) ధృవీకరించాలి.
4. ఆ తరువాత సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఇతర జిల్లాస్థాయి సంబంధిత అధికారులు షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ (SCSP) ట్రైబల్ సబ్ ప్లాన్ (TSP) ని అనుసరిస్తూ ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలి.
5 డేటా ధ్రువీకరించు టకు గ్రామ వాలంటీర్ కేంద్రబిందువుగా ఉంటాడు.
6 ఆ ప్రాంతంలోని తల్లులు వారి ఇచ్చిన డేటా ప్రకారం ఆ గ్రామ వాలంటీర్ వారి గుర్తింపు కొరకు అనుసంధానించబడతారు .
7.ఆ గ్రామ వాలంటీర్లకు తల్లులు డేటా హార్డ్ కాపీ, డిజిటల్ కాపీ రూపంలో అందించబడుతుంది
8. గ్రామ వాలంటీర్లు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ ఎం తో సమన్వయపరుచుకుని సంబంధిత ప్రొఫార్మా లో ఉన్న సమాచారాన్ని సేకరించి ఎంఈఓ గారి అనుమతి కోసం పంపవలసి ఉంది. 9.తల్లి లేని పక్షములో సంరక్షకుల వివరాలు గ్రామ వాలంటీర్లు ఎంఈవో గారికి సమర్పించాల్సి ఉంది .
10.ఈ పథకం కోసం అధికారులు ఏదైనా మోసపూరిత సమాచారం కానీ ధ్రువీకరణ గాని చేసినట్లయితే సంబంధిత అధికారులు పై తీవ్ర చర్యలు ఉంటాయి.
11. జిల్లా విద్యాశాఖ అధికారి , ప్రాంతీయ విద్యాశాఖ అధికారి ఈ సంబంధిత నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించాల్సి ఉంటుంది
12.ఈ పథకం సమర్థవంతంగా అమలు చేయుటకు సాంకేతిక మరియు సాఫ్ట్వేర్ డేటా ధ్రువీకరణ లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,కమ్యూనికేషన్ విభాగాలు ,రియల్ టైమ్ గవర్నెన్స్ ,సివిల్ సప్లై శాఖ సంయుక్తంగా సేవలు అందిస్తాయి
13.జగనన్న అమ్మబడి లబ్ధిదారుల జాబితాను సామాజిక ఆడిట్ కోసం గ్రామ వార్డు సచివాలయం లో ప్రదర్శించబడతాయి
★ గ్రామ వాలంటీర్లు సహకారంతో అర్హత గల తల్లుల నుండి బ్యాంక్ ఎకౌంట్ నెంబర్లు సేకరణ చేయాలి.
★ ఆ డేటా CSE Website లో అప్లోడ్ చేయాలి.
★ డిసెంబర్ 31, 2019 వ తేదీ నాటికి 75% శాతం హాజరు గల విద్యార్థులను గుర్తించాలి.