ఈ పథకం 1.11.1956 నుండి ప్రభుత్వోద్యోగులకు అమలులో వుంది. 1.11.1998 నుండి పంచాయితీరాజ్ ఉద్యోగులు ఉపాధ్యాయులకు కూడా వర్తింపచేశారు. జి.వో. యం.యస్. నెం. 211 ఆర్థిక శాఖ 17.12.97.
అన్ని మున్సిపాలిటీలకు జి.ఓ.ఎం. ఎస్. నెం.25 తేది. 3-3-2011 ద్వారా విజయవాడ, గ్రేటర్ విశాఖ కార్పోరేషన్లకు జి. ఓ. ఎం. ఎస్. నెం. 137 తేది. 21-10-2015 ద్వారా వర్తించబడినది.
అర్హతలు :
21-55 సం|| మధ్యవయస్కులైన తాత్కాలిక, శాశ్విత ఉద్యోగులందరూ విధిగా ఈ స్కీములో చేరాలి.
55 సం|| పూర్వమే ప్రీమియం చెల్లించి 55 సం|| వయస్సు దాటిన తరువాత ప్రతిపాదనలు పంపబడితే అటువంటి అభ్యర్థుల పాలసీలను తిరస్కరించడం జరుగు తుంది. 55 సం||దాటిన తర్వాత అదనపు ప్రీమియం చెల్లించి ప్రతిపాదనలు పంపినప్పటికీ అవి అంగీకరించ బడవు. (జీవో 36. తేదీ 5-3-2016 ప్రాప్తికి మార్చి 2016. నుండి 53 సం. వయస్సు 55 సం||కు పెంచబడినది.)
జి.ఒ.ఆర్.టి. 1604 ఫైనాన్స్ ప్లానింగ్ తేది. 5.12.78 మేరకు పాలసీ హోల్డర్ అఫిడవిట్ మేరకు మిస్సింగ్ క్రెడిట్ ను డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సరిచేయాలి. | కొత్తగా స్కీములో చేరిన ఉద్యోగులకు సంంధించి ఆ షెడ్యూలులో న్యూకేస్ అని పేర్కొనాలి. నిర్ణీత . దరఖాస్తు ఫారాలను పాలసీదారుడు యాజమాన్యం ద్వారా పంపుకొన్న పిదప పరిశీలించి పాలసీ నెంబరు కేటాయించి పాలసీబాండును సంబంధిత యాజమాన్యము ద్వారా ఆయా ఉద్యోగులకు ఇన్సూరెన్సు కార్యాలయమువారు అంద చేయుదురు. మొదటి నెల ప్రీమియం కట్టగానే దరఖాస్తు ఫారాలు పంపుకోవాలి. నెంబరు కేటాయింపబడని వారికి రిస్కు కవరు కాదు. ఉద్యోగంలో రెగ్యులర్ స్కేలులో 5 నియమింపబడిన మొదటినెల వేతనం నుండి ఏపిజియల్ఐ ప్రీమియం మినహాయించడం ప్రారంభించాలి. జి.ఓ. యం.యస్. నెం. 199,తేది 30-7-2013
వేతనం పెరిగినపుడు :
పాలసీదారుని జీతభత్యములలో ఇంక్రిమెంటు, ప్రమోషన్ తదితర కారణాల వల్ల పెరుగుదల జరిగినపుడు ప్రీమియం కూడా ఆయా స్లాబుల ప్రకారము మినహా యించాలి. పెరిగిన ప్రీమియం, గతంలో చెల్లిస్తున్న ప్రీమియం రెండింటినీ షెడ్యూళ్ళలో ఉదహరించి రిమార్కులు నమోదు చేయాలి.
పాలసీ నెంబరు, చెల్లిస్తున్న ప్రీమియం, పెరిగిన - ప్రీమియం వివరాలు సేవా పుస్తకంలో నమోదు చేయాలి. - ప్రతి సంవత్సరం సెప్టెంబరు ఆఖరు నాటికి నిర్ణీత అకౌంటు 5 స్లిప్లో ఆర్థిక సంవత్సరంలో ప్రారంభనిల్వ, చెల్లించిన 5 ప్రీమియంల మొత్తం, ఋణం వివరాలు, అంత్యనిల్వ ఉద్యోగికి యిన్సూరెన్సు కార్యాలయం వారు వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తారు. మూలవేతనంలో 20% వరకు ప్రీమియంను పెంచుకునే అవకాశముంది. అయితే దీనికి వైద్య పరీక్ష. ఇన్సూరెన్సు డైరెక్టరు అనుమతి అవసరం. (జి.వో.ఎం.ఎస్.నెం. 36 ఆర్థికశాఖ తేది. 22.2.95)
Insure చేసిన వ్యక్తి జీతము మీద సెలవులో యున్నప్పుడు ఆ జీతభత్యం డ్రా చేసేటప్పుడు ఈ ప్రీమియం వసూళ్లు చేయ బడును. ఒక ఉద్యోగిజీతం నష్టం సెలవు లేదా Suspensionలో యున్న అతని ప్రీమియం చెల్లించబడకపోతే ఆ ప్రీమియం మొత్తము ఆ పాలసీమీద అప్పుగా భావించబడి, ఆ అప్పులపై సం||నకు 8% చక్రవడ్డీ • చొప్పున లెక్కించి అతని భవిష్యత్ జీతము ఏరియర్ నుండి వాయిదాలలో రికవరీ చేయబడును.
Rule 36, APGLIC. G.O.Ms. No.138,Fin.Dt. 10-9-97. G.O.RT.1604, Fin.PIg. Dt. 5-12-78 మేరకు పాలసీ హోల్డర్ అఫిడివెట్ మేరకు మిస్సింగ్ క్రెడిట్స్ను డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సర్దుబాటు చేయాలి.
నామినేషన్ సౌకర్యం:
పాలసీ మొత్తముల పై నామినేషన్ సౌకర్యము కలదు. పాలసీదారులు భార్య/భర్త పిల్లలకు తప్పక నామినేషన్ యివ్వాలి. వీటితోబాటు తమ రక్తసంబంధీకులు, వివాహ సంబంధం గల వారిని మరియు చట్టబద్ద వారసులను మాత్రమే నామినీగా ప్రకటించుకోవచ్చు. దరఖాస్తు ఫారంతోబాటు నామినీల పేరు, వయస్సు, నామినీల తండ్రి పేరు విధిగా పేర్కొనాలి. (ఏ.పి.జి. యల్.ఐ. రూల్ 31)
ఋణ సౌకర్యం :
ఈ పాలసీలపై ఋణం కొరకు దరఖాస్తు చేసుకొనే నాటికి పాలసీ విలువపైగాని, పాలసీ సరెండరు విలువపైగాని 90% వరకు ఏది ఎక్కువైతే ఆ మొత్తమును రుణముగా మంజూరు చేస్తారు. ప్రభుత్వం ప్రీమియం మొత్తాలపై యిచ్చే వడ్డీకంటే రుణముపై ఒక శాతం అధికంగా | వడ్డీ వసూలు చేస్తుంది. ఈ రుణమును 12 వాయిదాలకు తగ్గకుండా 46వాయిదాలకుమించకుండా తిరిగిచెల్లిం చాలి. లోనునిమిత్తంచేస్తున్న మినహాయింపులను షెడ్యూలులో విడిగా చూపించాలి. ఉద్యోగి పేరు, హెూదా, తండ్రి పేరు, పుట్టినతేది, పాలసి నెం, మూలవేతనం, పెంచిన ప్రీమియం మొదలగు వివరాలను డ్రాయింగ్ ఆఫీసర్ జిల్లా ఇన్సూరెన్స్ అధికారికి పంపించవలెను. కొత్తప్రపోజల్స్ పంపించ నవ | సరం లేదు. (G.0. Ms. No.124, Dt 24-5-2013) |
కాలపరిమితి:
పాలసీలను పదవీ విరమణ తేదీ నాటికి మెచ్యూర్ అగునట్లు పరిమితం చేస్తారు. వాలంటరీ | రిటైర్మెంటు, మెడికల్ యిన్ వాలిడేషన్ లేక ఏ యితర కారణాల వల్లనైనా ఉద్యోగం మానుకుంటే పాలసీ మెచ్యూర్ | తేదీ వరకు పాలసీదారుడు విడిగా నెలవారీ క్వార్టర్లీ, అర్ధ సంవత్సరం లేక వార్షిక చందారూపలంలో ఆం.ప్ర. ప్రభుత్వ జీవితభీమా డిపార్టుమెటు వారికి చెల్లించవచ్చు లేక ఉద్యోగం మానిన తేది నాటికి పాలసీ సరెండరు విలువనుగానీ, పాలసీ యొక్క ప్రస్తుత విలువలను గానీ, ఆనాటికి చెల్లించిన | ప్రీమియమునకు సమానమైన పాలసీ మొత్తముగాని | పొందవచ్చు. చందారూపలంలో ఆం.ప్ర. ప్రభుత్వ జీవిత భీమా డిపార్టుమెటు వారికి చెల్లించవచ్చు లేక ఉద్యోగం మానిన తేది. నాటికి పాలసీ సరెండరు విలువనుగానీ, | పాలసీ యొక్క ప్రస్తుత విలువలను గాని, అనాటికి చెల్లించిన | ప్రీమియమునకు సమానమైన పాలసీ మొత్తముగాని పొంద | వచ్చు. పాలసీ కొనసాగించుటకు Date of Exit నుండి 3 నెలలలోపు ఇన్సూరెన్సుసంచాలకుల(D.O.I) అనుమతి పొందాలి.
క్లయిమ్ పొందు విధానము :
డెత్ క్లెయిములను ఇన్సూరెనూ డైరెక్టరుగారు సెటిల్ చేస్తారు. దీనికై
1) పేరెంటు డిపార్టుమెంటు ఉన్న తాధికారిచే ధృవీకరించబడి పూర్తిగా పూరింపబడిన రిఫండ్ ఫారం నెం.
2. (2) స్టాంపు అంటించిన అడ్వాన్సు రశీదు. 5
(3) ఒరిజినల్ పాలసీబాండు
(4) లీగల్ హైర్ సర్టిఫికేట్
5 (5) మరణ ధృవ పత్రము
(6) మేజర్లయిన అవివాహిత • మరియు వితంతు కుమార్తెల నుండి విత్డ్రాయల్ సర్టిఫికెట్లు - సమర్పించాలి. నామినీ ప్రకటించి ఉన్న యెడల క్లయిములు 2 త్వరగా సెటిల్ అగును.
మెచ్యూరిటీ మరియు ఇతర ఆ క్లయిములకు
1) గజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన రిఫండ్ ఫారం నెం. 1,
2) స్టాంపు గల అడ్వాన్సు రశీదు,
3) ఒరిజినల్ పాలసీబాండు
4) పాలసీ తేది నుండి క్లెయిమ్ 3 తేదీ వరకు పనిచేసిన స్థలాల వివరములు సమర్పించాలి. .
పాలసీ బెనిఫిట్స్ :
పాలసీ విలువపై ప్రభుత్వం ప్రకటించే రేటు గా మేరకు బోనస్, టెర్మినల్ బోనస్ లభిస్తుంది. ఈ పాలసీ ఏ ప్రీమియం మొత్తాలను ఆదాయం పన్ను నుండి మినహా * యిస్తారు. 21 సం|| వయస్సున్న పాలసీదారుడు కట్టే 1 తో రూపాయి ప్రీమియంకు పదవీ విరమణ తేదీ నాటికి రూ. 2, 453. 60 మొత్తంగా లభిస్తుంది. 40 సం||లు వయస్సున్న ఏ వ్యక్తికి ఒక రూపాయి ప్రీమియంకు రూ. 186.30లు కే అస్యూర్డు మొత్తంగా లభిస్తుంది. ఈ క్రింది పట్టిక ద్వారా తాము కట్టే ప్రీమియంపై పాలసీ మొత్తాలను లెక్కించుకోవచ్చును. ఈ పాలసీ మొత్తాలపై ప్రభుత్వం ప్రకటించిన ఆ రేట్ల మేరకు బోనస్, టెర్మినల్ బోనస్ యివ్వబడుతుంది. .
G.O.Ms. No. 29 Fin., Dt. 31-012009 ద్వారా కామన్ ప్రపోజల్ ఫారాలు ఇవ్వబడ్డాయి.