MEDICAL



          (User Name :- UDISE CODE, password :- Admin@First 4 disits of UDISE CODE)


                 DDO VERIFIACTION CERTIFICATE 

                Govt.Employees and Pensioners by Dr.NTR Vaidyaseva Trust - Guidelines

 Rc 222 Uploading  Medical bills in CSE website from 

       1-2- 2017



Medical Reimbursement proformas for Online Uploading Bills


Medical Reimbursement proposal & Claiming software dt.16.09.2016

FOR MORE INFORMATION  PLE. CLICK HERE





GO Rt 147 ,26-4-2016 Medical Reimbursement  Extended Upto 30-9-2016
U.O.20332_Medical_Reimbursement_Facility_continue_up_to_Mar_2014.pdf


           (User Name :- UDISE CODE, password :- Admin@First 4 disits of UDISE CODE)

GONo.74 (Medical Rates).

 GO.NO.105 dt.09-04-2007- AMENDMENT OF GO.NO.74

GO.Ms.68 MEDICAL REIUMBERSMENT

 Go 38 on medical reimbursement.

  HMF MS 397 dt.14-11-08 ,MEDICAL REIMBURSEMENT TO

                                                       PENSIONARS 1 lakh TO 2 lakHS.

.Peternity leave clarification Memo

Go.Ms.No .52 Dt.01-04-11-women Employees Spl Medical Leave 



Forms and Certificates    ( Old) 
2.CERTIFICATE-A (OP)                 
    3.NON DRAWAL CERTIFICATE    
7.CHECKLIST  





🌷 *మెడికల్ రీయంబర్స్మెంట్ సమాచారం సంబంధిత ఉత్తర్వులు:*🌷
🔷 ప్రభుత్వ,పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును.
(G.O.Ms.No.74 తేది:15-03-2015)


🔷          
      ఉద్యోగులకు,పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును.
(G.O.Ms.No.397 తేది:13-11-2008)

🔷     కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు.

🔷     వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి.

🔷           
       ప్రవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు.
(G.O.Ms.No.68 తేది:28-03-2011)

🔷       
     కీమోథేరపీ,రేడియోథేరపీ,డయాలసిస్, క్యాన్సర్,కిడ్నీ,గుండెజబ్బులు,ఎయిడ్స్,నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రులయందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు.

🔷      కంటి చికిత్స,దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు.కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు.దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు చేయించుకోవచ్చును.

🔷      రోడ్డుప్రమాదాలు సంభవించినపుడు మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు.స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి.
(G.O.Ms.No.175 తేది:29-05-1997)

🔷      40సం॥ నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు.
(G.O.Ms.No.105 తేది:09-04-2007)

🔷    
      మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్స్ అయినచో రీయంబర్స్మెంట్ అవకాశం కలదు.
(DSE Rc.No.350/D2-4/2008 తేది:15-04-2008)

🔷      కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.
(G.O.Ms.No.87 తేది:28-02-2004)

🔷  
      హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తేది నుండి 6 నెలలలోపు,చనిపోయినచో 8 నెలలలోపు DEO/DSE కి ప్రతిపాదనలు పంపాలి.

🔷   
       రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లును Rc.No.8878/D2-4/09 తేది:02-09-2009 ద్వారా వివరించారు. -STUAP-D/F SEE THIS -SOME G O s useful to ours


సందేహాలు - సమాధానాలు :-
1.ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా?
జవాబు:చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
2.నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా?
జవాబు: జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.
3 మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా?
జవాబు: చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.
4: దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి EHS వర్తిస్తుందా?
*జవాబు:జన్మనిచ్చిన తల్లిదండ్రులకి లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి ఎవరో ఒకరికి మాత్రమే ehs వర్తిస్తుంది
5.:సవతి పిల్లలు కి EHS వర్తిస్తుందా?
*జవాబు:జీఓ.174; తేదీ:1.11.2013 ప్రకారం సవతి పిల్లలు కూడా ehs ప్రయోజనాలు పొందవచ్చు.
6.మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేఇ0చుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా?
జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు.
 బోన్ టీబీ కి ప్రత్యేక సెలవు ఉన్నదా??
జవాబు:  6 నెలల వరకు పూర్తి జీతంపై అర్ధ జీతపు సెలవు మంజూరు చేస్తారు.
ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??
జవాబు:  మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.
ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs వస్తాయా??
జవాబు:   అవును..హాఫ్ పే లీవుకు ELs వస్తాయి..లాస్ ఆఫ్ పే పీరియడ్ కు రావు..
10 ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ?
జవాబు:G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.


   సందేహాలు - సమాధానాలు:-
11:ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ?
జవాబు: A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా "Leave Salary payable in India after the end of each calender month" కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు.
12 :   అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఐటీ లో మినహాయింపు ఏమైనా ఉందా?
జవాబు:తీవ్ర రోగాల చికిత్స కై చేసిన వాస్తవ ఖర్చు లో 40,000రూ వరకు 80DDB కింద మినహాయింపు కలదు.దీని కోసం డాక్టర్ ధ్రువ పత్రం సమర్పించాలి.
13 నేను,నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా?
జవాబు:చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.
14 నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..?
జవాబు:మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.    ( GO MS No:262, Dt:25-8-1980)
15 కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రత్యేక సెలవు ఏమైనా ఇస్తారా?
జవాబు: జీఓ.286,తేదీ:29.10.91 ప్రకారం 6 నెలలు గరిష్టంగా అర్ధ వేతన సెలవులకి అర్హుడు.ఈ కాలంలో పూర్తి వేతనం పొందవచ్చు.
16: ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??
జవాబు: మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.
17 ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.
జవాబు: Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు.
18 :   ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్ సెలవుగా పరిగణించాలా?
సమాధానం:   ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.
19.  మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?
సమాధానం:  రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది
20.  ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?
సమాధానం:  అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి
21:  మెడికల్ సెలవు కోసం డాక్టర్ సెర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సెర్టిఫికెట్ ఒకే డాక్టర్ వద్ద తేవాలా?
జవాబు:  ఒకే డాక్టర్ వద్ద అవసరం లేదు. రెండూ వేర్వేరు డాక్టర్ల దగ్గర తేవచ్చు.
22:   నా తలిదండ్రులకి వైట్ కార్డు ఉంది.పొరపాటున EHS లో నమోదు చేశాను. ఇపుడు తొలగించాలి అంటే నేను ఏమి చేయాలి?
జవాబు:  ehf పోర్టల్ లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.లేదా సంబంధిత ddo ను సంప్రదించాలి.
23:  బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా??
జవాబు:  Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా,ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.
24:   EHS పై కంటి ఆపరేషన్ చేయించుకుంటేహాస్పిటల్ వారికి ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుంది??
జవాబు:  26,000/- ఇస్తుంది.
25:  భార్య ప్రసవించిన సందర్భంగా భర్త paternity లీవ్ ఎలా వాడుకోవాలి??
జవాబు Paternity Leave to Male Government Employees. (G.O.Ms.No.231 Dated: 16-9-2005)
The employees of Government of India can avail paternity leave either before 15 days or within a period of 6 months from the date of delivery. (Cir.Memo.No. 20129-C/454/FR.I/2010 Dated: 21-07-2010)
26:   నాకు ఉద్యోగం రాకముందు పాప ఉందిఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా?
జవాబు:  ఇద్దరు జీవించి ఉన్న పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుందిబిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమావచ్చిన తరువాతాఅనే దానితో నిమిత్తం లేదుకావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.
27.   ప్రస్తుతం మెడికల్ రీ-అంబర్సుమెంట్ బిల్లులు ముందు ఎవరికి పంపాలి?
జవాబు:    ముందు చుట్టిగుంటగుంటూరు లోని NTR వైద్య సేవ ట్రస్ట్ కి పంపాలి.

మెడికల్ రీయంబర్స్మెంట్  (MEDICAL REIMBURESEMENT)
                 ప్రభుత్వ,పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్దారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును. (G.O.Ms.No.1 తేది.15-03-2005)
ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును.
(G.O.Ms.No.397 తేది:13-11-2008)*
            కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(CCHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు.
వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి.
ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు. *(GO.Ms.No.68 తేది:28-03-2011)
               కీమోథెరపీ, రేడియోథెరపీ,డయాలసిస్,క్యాన్సర్, కిడ్నీ, గుండెజబ్బులు,ఎయిడ్స్, నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల యందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు.
               కంటి చికిత్స, దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు.కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు.దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు చేయించుకోవచ్చును.
                       రోడ్డుప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి. (G.O.Ms.No.175 తేది:29-05-197)
40సం|| నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు. *(G.O.Ms.No.105 తేది:09-04-2007)
40సం|| నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు. *(G.O.Ms.No.105 తేది:09-04-2007)
మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్ అయినచో రీయంబర్సెంట్ అవకాశం కలదు. *(DSE Rc.No.350/D2-4/2008 తేది:15-04-2008)
కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు. *(G.O.Ms.No.87 తేది:28-02-2004)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు జీవిత కాలంలో ఒకే వ్యాధికి 3 పర్యాయాల వరకు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును. *(G.O.Ms.No.60 M&H Dt:15-10-2003)
నిర్ణీత పదవీ విరమణ వయస్సు పూర్తి చేసి(సూపరాన్యుయేషన్) పై రిటైరైన వారికి మాత్రమే రీయింబర్సంట్ సౌకర్యం వర్తింపచేసారు.నిర్బంధ పదవీ విరమణ వాలంటరీ రిటైర్మెంట్, మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైర్మెంట్ పొందిన వారికి ఈ సౌకర్యం వర్తించదు. (G.O.Ms.No.40 Dt:25-06-1991)
                హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తేది నుండి 6 నెలలలోపు, చనిపోయినచో 8 నెలలలోపు DEO/DSE కి ప్రతిపాదనలు పంపాలి.
                                      రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లును RC.No. 8878/D2-4/09 తేది:02-09-2009 ద్వారా వివరించారు.

 మహిళలా ఉద్యోగులకు ప్రత్యేకం
★పురుషులు తో పోల్చిన మహిళా టీచర్లకు 5 CL లు అధికం.
(G.O.Ms.No.374, Edn, Dt:16-3-1996)
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే 14 రోజులు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.1415, M&H, Dt:10-06-1968)
మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయిన రెండవ ఆపరేషన్ కు కూడా 14 రోజులు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.124, F&P, Dt:13-04-1982)
లూప్ వేయించుకొన్న రోజు స్పెషల్ CL ఇస్తారు.
(G.O.Ms.No.128, F&P,Dt:13-04-1982)
ఆపరేషన్ తరువాత పిల్లలు చనిపోతే రీకానలైజెషన్ చేయించుకున్న ఉద్యోగికి 21 రోజులు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.102,M&H,Dt:19-02-1981)
గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫార్సు మేరకు 45 రోజులు ప్రత్యేక సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.52, Fin,Dt:1-04-2011)
180 రోజులు ప్రసూతి సెలవు ఇస్తారు. ఇది ఇద్దరు జీవించి యున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
(G.O.Ms.No.152, Fin,Dt:04-05-2010) &
(G.O.Ms.No.38, F&P, Dt:13-08-1992)
సమ్మర్ హాలిడేస్ లో ప్రసవించిన , ఇక్కడి నుండి 180 రోజులు ఇస్తారు.
(G.O.Ms.No.463,Edn,Dt:04-05-1979)
అబార్షన్ ఐనచో 6 వారాలు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.762,M&H,Dt:11-08-1976)
వివాహం కొరకు 75,000 అప్పుగా ఇస్తారు.దీనిని 70 వాయిదాల లో తిరిగి 5.50% వడ్డీ తో సహా చెల్లించాలి.
(G.O.Ms.No.39 F&P,Dt:15-04-2015).

మెడికల్ ఇన్వాలిడేషన్

అనారోగ్య కారణంగా పదవీ విరమణ పొందు ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు కనీసం 5 సంవత్సరాల సర్వీసు కలిగియుండి,ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి జీవనాధారము లేని తీవ్ర,దుర్భర ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినచో నియామకాధికారి సంతృప్తి చెందిన మీదట కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబ ఆధారితులకు కారుణ్య నియామకము చేస్తారు.
(G.O.Ms.NO.504,GAD తేది:30-4-1980)
(G.O.Ms.NO.309,GAD తేది:04-07-1985)
(A.P Pension code volume-I,Article-441)


తదుపరి ఒక కేసులో రాష్ట్రఉన్నతస్థాయి న్యాయస్థానం అట్టి కారుణ్య నియమకాలు రాజ్యంగ విరుద్దమని తీర్పు వెలువరించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ పై కారుణ్య నియామకాల పద్దతిని రద్దుపరచింది.

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుమేరకుప్రభుత్వం మరలా మెడికల్ఇన్వాలిడేషన్ పై  ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పద్దతిని మరలా పునరుద్దరించింది.(G.O.Ms.No.661 GAD తేది:23-10-2008)

ఎవరు అర్హులు:

కుటుంబ సభ్యులు అనగా AP Revised Pension Rules 1980 లోని రూలు 50(12B)లో నిర్దేశించిన వారై ఉండాలి.

భార్య/భర్త, కుమారులు,కూతుళ్ళు , చట్టరిత్యా దత్తత తీసుకున్న కుమారుడు/కూతురు, అట్టి దత్తత రిటైర్మెంటుకు ముందుగా తీసుకునియుండాలి.

అవివాహిత కూతురు,విధవరాలైనకూతురు,విడాకులు పొందిన కూతురు.


మెడికల్ ఇన్వాలిడేషన్ నిబంధనలు*
మెడికల్ ఇన్వాలిడేషన్  కోరు ఉద్యోగి నియామకాధికారికి దరఖాస్తు చేసుకోవాలి.

సదరు దరఖాస్తు మెడికల్ బోర్డు సిఫార్సులనిమిత్తం పంపబడుతుంది.

 జూనియర్ అసిస్టెంట్, తత్సమానమైన పోస్టు అంతకంటే తక్కువైన పోస్టులో నియామకం చేయవచ్చు.
(G.O.Ms.No.35 తేది:10-04-2000)


మెడికల్ ఇన్వాలిడేషన్ పై ఉద్యోగి రిటైరైన తేదినుంచిఒక సంవత్సరం లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

నియామక ఉత్తర్వులు జారీచేసిన తర్వాత,అభ్యర్ధికి సంబంధించిన అన్ని వివరములుఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తెలియజేయాలి.


మెడికల్ బోర్డు నివేదిక  అందిన తర్వాత ఉద్యోగిని  నియామక అధికారి జిల్లాస్థాయి కమిటీ వారి పరిశీలనార్ధం పంపాలి.

జిలాస్థాయి కమిటీ:

1.జిల్లా కలెక్టర్-అధ్యక్షుడు(CHAIRMAN)
2.జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి-సభ్యుడు
3.సంబంధిత జిల్లా శాఖ అధికారి-సభ్యుడు/కన్వీనర్


శాఖధిపతి(Head of the Department)కార్యాలయాలలో పనిచేయు ఉద్యోగులు/సెక్రటేరియేట్ శాఖాలలో పనిచేయు ఉద్యోగుల విషయంలో రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది

మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం క్రింద,కారుణ్యనియామకాలు,యూనిట్ నియామకాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 5 % మించకూడదు.


భార్య,భర్తలిరువురు ఉద్యోగులైన సందర్భములో కారుణ్య నియామకానికి అవకాశము లేదు.*

 
మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీము జిల్లాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ టీచర్లకు వర్తింపచేసారు.   మెడికల్ ఇన్వాలిడేషన్(అనారోగ్య కారణాలపై)వైద్య ధ్రువపత్రము ద్వారా రిటైర్ అయిన వారికి పెన్షన్,కమ్యూటేషన్ అవకాశములేదు.

మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగికి ఇన్వాలిడు పింఛను ఇస్తారు

ఏ జబ్బుల వల్లమెడికల్ ఇన్వాలిడేషన్ పై  రిటైరు కావచ్చు*

క్రింద తెలిపిన ఏదేని జబ్బులు రోగ పీడితులుగా ఉన్న ఉద్యోగి మెడికల్ఇన్వాలిడేషన్ పై మెడికల్ బోర్డు నిర్థారణ సర్టిఫికేట్ ఆధారంగా,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైరు కావచ్చును.

1.పక్షవాతము(PARALYSIS):             
A)నాలుగు అవయవములు-కాళ్ళు,చేతులు
B)ఒకవైపు పై భాగము లేదా,క్రింది భాగము
C)క్రింది భాగము రెండు అవయవములు లేదా/అంగములు


అంతిమదశలో ఉన్న మూత్రపిండముల రోగము(END STAGE RENAL DISEASE)

అంతిమదశలో ఉన్న కాలేయ రోగము(END STAGE LEVER DISEASE)

క్యాన్సరు(CANCER WITH METASTASIS STAGE OR SECONDARIES)

మానసిక సంబంధితము(DEMENTIA-MENTAL DISORDER)

తీవ్రమైన పార్కిన్సన్ జబ్బు(SEVERE PARKINSON DISEASE)


మెడికల్ ఇన్వాలిడేషన్  విషయంలో కమిటీకి పంపవలసిన వివరములు*

GOVT MEMO.NO.10054/K2/2009 తేది:05-09-2009 ప్రకారం_

1.మెడికల్ ఇన్వాలిడేషన్ కోరు ఉద్యోగి పేరు:
2.ఉద్యోగి పనిచేస్తున్న శాఖ-హోదా-జీతపు స్కేలు:
3.ఏదైనా క్రమశిక్షణా చర్యలు అపరిష్క్రుతంగాఉన్నాయా:
4.ఉద్యోగి సర్వీసు క్రమబద్దీకరించబడిందా:
5.సర్వీసు రిజిస్టరు మేరకు పుట్టిన తేది:
6.వాస్తవంగా కాలపరిమితిమేరకు పదవీవిరమణ  చేయు తేది:
7.రోగ వివరములు:
8.అట్టి రోగము ప్రభుత్వ ఉత్త్ర్వులు G.O.Ms.No.661, తేది:23-10-2008 లో తెలిపిన మేరకు కలిగియున్నదా:
9.ఉద్యోగి రోగ చికిత్స నిమిత్తం అతను/ఆమె మెడికల్ సెలవుపై ఉన్నారా,అయితే ఏ తేదినుంచి  అట్టి సెలవుపై అట్టి             రోగ చికిత్స నిమిత్తం ఉన్నారు:

10.మెడికల్ బోర్డు వారి సిఫార్సులు(ORIGINAL) సిఫార్సు జతపరిచారా:

11.శాఖాపర విశ్లేషణ-సిఫార్సు


  Spl.Disability Leave
  ఫండమెంటల్ రూల్ 83 ప్రకారం విధి నిర్వాహణ సందర్భంలో గాయపడి అశక్తులైన శాశ్వత మరియు తాత్కాలిక ఉద్యోగులకు ఈ సెలవు మంజూరుచేయబడుతుంది. సంఘటన జరిగిన మూడు నెలలలోగా అశక్తత స్పష్టమైన సందర్భంలోనే ఈ సెలవు మంజూరు చేయబడుతుంది.(Fundamental Rule-83(1)
                                    24 నెలలకు మించకుండా వైద్యాధికారి సిఫారసు మేరకు ఈ ప్రత్యేక అశక్తత
సెలవును మంజూరుచేయు అధికారం ప్రభుత్వానికే తప్ప ఏ ఇతర అధికారులకు లేదు. గజిటెడ్ ఉద్యోగుల విషయంలో అయితే మెడికల్ బోర్డు,NGO ల విషయంలో సివిల్ సర్జన్ సర్టిఫికెట్ జారిచేయాల్సి వుంటుంది.(Fundamental Rule-83(3) కాని సెలవు రెండు నెలలకు మించని పరిస్థితులలో ప్రభుత్వ వైద్యాధికారి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు.G.O.Ms.No.40 Fin తేది:03-06-1991
               ఈ సెలవు ఇతర సెలవులతో కలిపి కూడా మంజూరుచేయవచ్చు.ఈ సెలవు ఏ సెలవు ఖాతా నుండి తగ్గించకూడదు. ఈ సెలవు కాలంలో ఉద్యోగులకు 120 రోజులకు పూర్తి జీతం.మిగితా కాలానికి సగం జీతం మంజూరుచేస్తారు. కార్యాలయం నుండి ఇంటికి,ఇంటి నుండి కార్యాలయానికి వేళ్ళుచున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల అశక్తతకు గురియైతే ఈ సెలవు మంజూరు చేయడానికి వీలులేదు. కాని ఒక కార్యాలయం నుండి మరోక కార్యాలయానికి,కోర్టుకో లేక ఫీల్డులో కార్యస్థానమునకు వెళ్ళు సందర్భంలో ప్రమాదానికి గురై అశక్తులైన ఉద్యోగులు ఈ సెలవుకు అర్హులు.(G.O.Ms.No.133 F&P తేది:19-06-1991)


               Health Card  - EHS  ( సమగ్ర సమాచారము )
                                            రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 'ది ఆంధ్ర ప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ అటెండెన్స్‌ రూల్స్‌, 1972' క్రింద ప్రస్తుతం వున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సిస్టమ్‌లో భాగంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్ట్‌ క్రింద నమోదయిన ఆసుపత్రుల నెట్‌వర్క్‌ ద్వారా నగదు రహిత చికిత్సలను అందించేందుకు ఉద్దేశించినది ఉద్యోగుల ఆరోగ్య పథకం. (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ - ఇహెచ్‌ఎస్‌).
                     5 డిసెంబర్‌ 2013 వ తేదీన ప్రారంభించిన ఈ పథకాన్ని జి.ఓ. ఎంఎస్‌. నెంబర్‌ 134 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, డేటెడ్‌ 29.10.2014 ప్రకారం మార్పులతో ఈ పథకం ప్రస్తుతం అమలు అవుతోంది.
 1.Healthcard ఎవరు అర్హులు?
ఎ)ఎఫ్‌ఆర్‌లో నిర్వచించిన అందరు రెగ్యులర్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొవిన్షియలైజ్డ్‌ వర్క్‌ ఛార్జ్‌డ్‌ ఉద్యోగులతో సహా
బి) స్థానిక సంస్థల ప్రొవిన్షియలైజ్డ్‌ ఉద్యోగులు
సి) అందరు సర్వీస్‌ పింఛనుదారులు
డి)కుటుంబ పింఛనుదారులు
ఇ) తిరిగి ఉద్యోగం పొందిన సర్వీసు పింఛనుదారులు
                 ఎవరు అర్హులు కాదు?
ఎ)సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వేలు, ఆర్‌టిసి, పోలీసు శాఖకు చెందిన ఆరోగ్య భద్రత, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సయిజ్‌ శాఖకు చెందిన ఆరోగ్య సహాయతల వంటి ఇతర బీమా పథకాలు వర్తించే వారు
బి) లా ఆఫీసర్స్‌ (అడ్వొకేట్‌ జనరల్‌, స్టేట్‌ ప్రాసిక్యూటర్స్‌, స్టేట్‌ కౌన్సెల్స్‌, ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్‌ ప్రొసిక్యూటర్లు
సి) క్యాజువల్‌, దినసరి వేతనంపై పనిచేసే కార్మికులు
డి) దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు జీవించివుండగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు
ఇ) AIS officers and AIS pensioners and
జి) జ్యుడిషియల్‌ అధికారులు
     2.కుటుంబ సభ్యులు అంటే ఎవరు?
ఎ) భార్య లేదా భర్త
బి) పూర్తిగా ఆధారపడిన పిల్లలు (దత్తత తీసుకొన్న పిల్లలతో సహా)
సి) పూర్తిగా ఆధారపడిన తల్లిదండ్రులు (దత్తత తీసుకొన్న లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులు; కాని ఇద్దరికీ కాదు)
డి) సర్వీసు పింఛనుదారుల తరహాలోనే కుటుంబ పింఛనుదారులపై ఆధారపడిన వారు కూడ అర్హులు
4.ఆధారపడటం అంటే?
ఎ) తమ జీవనోపాధి కోసం పూర్తిగా ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు
బి) నిరుద్యోగులైన కుమార్తెల విషయంలో వారు అవివాహితులు లేదా వైధవ్యం పొందిన వారు లేదా విడాకులు తీసుకొన్న వారు లేదా వదిలిపెట్టబడిన వారు (వయస్సు పరిమితి ఆంక్షలు లేవు) అయి వుండాలి.
సి) నిరుద్యోగులైన కుమారులు 25 సంవత్సరాల లోపు వయస్సు వారై వుండాలి.
డి) వికలాంగులైన పిల్లల విషయంలో ఆ వైకల్యం వారి ఉపాధికి అవరోధంగా వుండాలి.
5.న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్లీడర్లు, స్టాండింగ్‌ కౌన్సెల్స్‌ అర్హులా?
కాదు, లా ఆఫీసర్లు, జ్యుడిషియల్‌ ఆఫీసర్లకు ఈ పథకం వర్తించదు.
6.ఉద్యోగి తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డు వుంటే, వారు ఈ పథక ప్రయోజనాలకు అర్హులా?
                          ఆరోగ్య శ్రీ కార్డు (తెల్ల కార్డు)ను కేవలం బిపిఎల్‌ కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ జీవిక కోసం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడివుంటే, వారి తెల్ల రేషన్‌ కార్డును రద్దు చేసి, పేదలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందుతున్నందుకు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలను తీసుకొంటారు. తల్లిదండ్రులు స్వతంత్రంగా జీవిస్తూ, ఆరోగ్య శ్రీ కార్డు కలిగివుంటే వారికి అర్హత వుండదు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో వారిని ఉద్యోగి చేర్చకూడదు.

7.తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ఉద్యోగి తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివుండి, ఉద్యోగి వారి పేర్లను దరఖాస్తు నుంచి తొలగించాలంటే ఏం చేయాలి?
                     తెల్ల రేషన్‌ కార్డు కలిగిన తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివున్నట్లయితే, ఆ ఉద్యోగి వారి పేర్లను తొలగించేందుకు ఇహెచ్‌ఎఫ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా దరఖాస్తు నుంచి వారి పేర్లను తొలగించేందుకు సంబంధిత డిడిఓను సంప్రదించాలి.

8. ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులా?
కాదు. ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులు కాదు.

9. సవతి పిల్లలు ( స్టెప్‌ చిల్డ్రన్‌ ) ఇహెచ్‌ఎస్‌ సదుపాయానికి అర్హులా?
అవును. జి.ఓ. ఎంఎస్‌. నెం. 174, హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్‌, తేదీ 01.11.2013 ప్రకారం స్టెప్‌ చిల్డ్రన్‌ ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలకు అర్హులు.

10.దత్తత తీసుకున్న పిల్లలు లేదా దత్తత తీసుకొన్న తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుందా?
అవును. దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కానీ అందరికీ కాదు. అదే విధంగా దత్తత తీసుకొన్న పిల్లలకు కూడ వర్తిస్తుంది.

11.నిరుద్యోగిగా వున్న కుమారుడు 25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడ ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తుంటే, అతడు పథక ప్రయోజనాలకు అర్హుడా?
కాదు. కుమారుడికి 25 సంవత్సరాలు దాటిన పథక ప్రయోజనాలు పొందేందుకు అనర్హుడు అవుతాడు. ఉద్యోగి / పింఛనుదారుడిపై ఆధారపడిన కుమారుడు వికలాంగుడై, ఆ వైకల్యం అతడి ఉపాధికి అవరోధంగా వుంటే, పథక ప్రయోజనాలు అతడికి వర్తిస్తాయి. అయితే వైకల్య ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.

12.భార్యాభర్తల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా వుండి, వేరొకరు ప్రైవేటు లేదా ఇతర వైద్య బీమా పథకం క్రింద వుంటే, వారు అర్హులా?
అవును. కుటుంబ సభ్యులైన ఆమె / అతడిని పథక లబ్ధిదారుగా చేర్చవచ్చు. అయితే వారికి సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వే, ఆర్‌టిసి, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత వర్తిస్తుంటే, ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలను పొందటానికి వీలులేదు.
ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత పథకం వర్తించే ఉద్యోగులు ఇహెచ్‌ఎస్‌ క్రింద నమోదుకు అర్హులా?
కాదు. ఉద్యోగిగా అతడు / ఆమె కి ఇహెచ్‌ఎస్‌ వర్తించదు. అయితే పదవీ విరమణ తర్వాత సర్వీస్‌ పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయి.

13.రాష్ట్రం వెలుపల నివసిస్తున్న పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయా?
ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.
14.ఇహెచ్‌ఎస్‌లో ఉద్యోగిగా ఎలా నమోదు కావాలి?
ఉద్యోగి నమోదు అయ్యేందుకు ప్రత్యేక నమోదు ప్రక్రియ ఏమీ లేదు. డిడిఓలు సిఎఫ్‌ఎంఎస్‌ క్రింద ఆర్థిక శాఖకు సమర్పించిన ఉద్యోగుల డేటా (ఆధార్‌ డేటా సహా)ను ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌కు అందజేయటం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఇహెచ్‌ఎస్‌ పోర్టల్‌లో వుంచిన కార్డులను డౌన్‌లోడ్‌ చేసి, ప్రింట్‌ చేసుకొని ఉద్యోగి, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవచ్చు.
15.ఇహెచ్‌ఎస్‌లో పింఛనుదారుగా ఎలా నమోదు కావాలి?
ఎ) www.ehf.gov.in. వెబ్‌పోర్టల్‌లోకి లాగిన్‌ కావాలి.
బి) మీ యూజర్‌ నేమ్‌ p + STO ID + PPO ID ఉదా : మీ ఎస్‌టిఓ ఐడి 230, పిపిఓ ఐడి 012 అయితే మీ యూజర్‌ నేమ్‌ = p230012 అవుతుంది. మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను ఎస్‌టిఓ / ఎపిపిఓల నుంచి లేదా '104'కు ఫోన్‌ చేయటం ద్వారా 104 - సేవాకేంద్రం నుంచి పొందవచ్చు.
సి) యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లతో సైన్‌ ఇన్‌ అయిన తర్వాత దరఖాస్తును సమర్పించవచ్చు.
ట్రస్ట్‌ ఆమోదించిన తర్వాత మీకు ఆరోగ్య కార్డు లభిస్తుంది. ఇహెచ్‌ఎస్‌ జాబితాలో పేర్కొన్న ఎంపానెల్డ్‌ ఆసుపత్రులు, స్పెషాలిటీస్‌ ప్రకారం కార్డుదారులు పథక ప్రయోజనాలను పొందవచ్చు.
16.ఇహెచ్‌ఎస్‌లో నమోదు అయ్యేందుకు ఆధార్‌ కార్డు లేదా ఎన్‌రోల్‌మెంట్‌ స్లిప్‌ తప్పనిసరిగా కావాలా?
అవును. ఆధార్‌ కార్డు ఎన్‌రోల్‌మెంట్‌ నెంబరు వున్నా, ఇహెచ్‌ఎస్‌లో ఎన్‌రోల్‌ కావచ్చు. దరఖాస్తు ఫారంలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నెంబరును ఏ విధంగా వ్రాయాలో సూచించటం జరిగింది.
17.పింఛనుదారు పథకం క్రింద నమోదు కాకపోతే, వారు పథకం కోసం కంట్రిబ్యూట్‌ చేయాలా?
అవును. జిఓ ఎంఎస్‌ నెంబరు 134, హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, తేదీ 29.10.2014 ప్రకారం పథకం క్రింద ఉద్యోగి నమోదు అయ్యారా లేదా అనే దానితో సంబంధం లేకుండా 01.12.2014న చెల్లించే నవంబర్‌ పింఛను, ఆ తర్వాత పింఛన్ల నుంచి ఆటోమాటిక్‌గా ఎస్‌టిఓ /ఎపిపిఓలు కంట్రిబ్యూషన్‌ను మినహాయిస్తారు.
18.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి / పింఛనుదారు ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి / పింఛనుదారు అయిన తన భర్త / భార్యను ఆధారపడిన కుటుంబ సభ్యులుగా నమోదు చేసినప్పుడు, ఆ రెండవ వ్యక్తి జీతం / పింఛను నుంచి కంట్రిబ్యూషన్‌ను డిడక్ట్‌ చేయటం జరుగుతుందా?
                   జిఓ ఎంఎస్‌ నెం.174 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్‌, డేట్‌ 01.11.2013 లోని పేరా 6.3 ప్రకారం భార్యాభర్తలిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా సర్వీస్‌ పెన్షనర్లు అయితే, ఎవరో ఒకరు కంట్రిబ్యూట్‌ చేస్తే సరిపోతుంది. అటువంటి సందర్భంలో తమ భార్య / భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యగి / సర్వీస్‌ పెన్షనర్‌ అని డిక్లరేషన్‌ ఇస్తూ, వారి ఎంప్లాయీ కోడ్‌ / పెన్షనర్‌ కోడ్‌ను తెలియజేయాలి.
19. పథకం క్రింద మొత్తం కుటుంబానికి రేషన్‌ కార్డు వంటి ఒకే కార్డును ఇస్తారా?
లేదు. ఉద్యోగికి, పింఛనుదారుకి, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వ్యక్తిగత కార్డులను ఇస్తారు.
 19(a) పథకం క్రింద ఉద్యోగి / పింఛనుదారు చందా ఎంత వుంటుంది?
నెలసరి చందా రూ.90 (I నుంచి IV వరకు పే గ్రేడ్స్‌ వున్న స్లాబ్‌ ఎ ఉద్యోగులు, V నుంచి XVII వరకు పే గ్రేడ్స్‌ వున్న స్లాబ్‌ బి ఉద్యోగులు) . నెలసరి చందా రూ.120 (XVIII నుంచి XXXII వరకు పే గ్రేడ్స్‌ వున్న స్లాబ్‌ సి ఉద్యోగులు) . పింఛనుదారు సర్వీస్‌ నుంచి పదవీ విరమణ చేసిన పోస్ట్‌ ప్రస్తుత పే గ్రేడ్‌ను బట్టి సర్వీస్‌ పింఛనుదారులు లేదా కుటుంబ పింఛనుదారుల చందా ఆధారపడివుంటుంది.

20. పింఛనుదారుకు ఆరోగ్య కార్డు ఎక్కడ నుంచి జారీ అవుతుంది?
ఆరోగ్య కార్డును ట్రస్ట్‌ జనరేట్‌ చేసి, పింఛనుదారు లాగిన్‌లో వుంచుతుంది. యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తూ పింఛనుదారు పోర్టల్‌లోకి లాగిన్‌ అయి, ఆరోగ్య కార్డును డౌన్‌లోడ్‌ చేసి, ప్రింట్‌ తీసుకోవాలి. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం క్రింద నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో చికిత్స తీసుకొనేందుకు దీనిని ఉపయోగించవచ్చు.
21.భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు / పింఛనుదారులు అయితే, ఎవరు కంట్రిబ్యూషన్‌ చెల్లించాలి?
ఉద్యోగి / సర్వీస్‌ పింఛనుదారులలో ఎవరో ఒకరు చెల్లిస్తే సరిపోతుంది.

22.నిరుద్యోగి అయిన కుమార్తె, అవివాహిత అయితే, ఆమెకు పథకం వర్తిస్తుందా?
అవును. అవివాహితలు, భర్త మరణించిన వారు లేదా విడాకులు తీసుకున్న వారు లేదా భర్త వదిలిపెట్టిన కుమార్తెలు నిరుద్యోగిగా వుంటే, వారు అర్హులవుతారు. తర్వాత వారికి వివాహం జరిగితే, వారు అనర్హులవుతారు.

     23. 25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడి పేరును తొలగించే అధికారం ఎవరికి వుంటుంది?
ఉద్యోగి / పింఛనుదారు పేర్కొన్న కుమారుడి జన్మదినం వివరాలు సిస్టమ్‌లో వుంటాయి. 25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడిని సిస్టమ్‌ ఆటోమాటిక్‌గా అనర్హుడిగా చేయటంతో పాటు అతడి ఆరోగ్య కార్డును ఇన్‌వాలిడేట్‌ చేస్తుంది.

24.నా పాస్‌వర్డ్‌ మర్చిపోయాను. కొత్త పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేయటం ఎలా?
హోమ్‌ పేజీలో సైన్‌ ఇన్‌ బటన్‌ను క్లిక్‌ చేసిన తర్వాత 'ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌' పై క్లిక్‌ చేయాలి. సిస్టమ్‌ జెనరేట్‌ చేసిన పాస్‌వర్డ్‌ దరఖాస్తుదారు మొబైల్‌ నెంబరుకు, ఇ మెయిల్‌ ఐడికి అందుతుంది.
25.కొన్ని వివరాలను తప్పుగా వ్రాసి దరఖాస్తును ట్రస్ట్‌కు సమర్పించటం జరిగింది. వీటిని సరి చేయటం ఎలా?
పింఛనుదారుల విషయంలో ఒకసారి సమర్పించిన తర్వాత, వ్యక్తిగతంగా దానిని సరిచేయటానికి కుదరదు. ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును తిరస్కరించినప్పుడు దరఖాస్తుదారు వివరాలను సరిచేసి, అంగీకారం కోసం తిరిగి సమర్పించాలి. లేదా ఫిర్యాదును బట్టి ట్రస్ట్‌ జెఇఓ (ఇహెచ్‌ఎస్‌) సరిచేయవచ్చు. ఉద్యోగుల విషయంలో, డిడిఓలు ఆర్థిక శాఖకు అందజేసిన హెచ్‌ఆర్‌ఎంఎస్‌ డేటాను ఉపయోగిస్తూ ఆరోగ్య కార్డులను జారీ చేయటం జరుగుతుంది. అందజేసిన సమాచారంలో తప్పులను సరిచేసే అవకాశం ఉద్యోగులకు వుంది. ఉద్యోగులు ఆధార్‌ వివరాలను ఎడిట్‌ చేయవచ్చు. ఇతర వివరాలను ఎడిట్‌ చేయటానికి కుదరదు.
26.పాస్‌వర్డ్‌ను మారుస్తున్నప్పుడు నా మొబైల్‌ నెంబరును తప్పుగా పేర్కొనటం జరిగింది. ఇపుడు నేను ఏం చేయాలి?
 అటువంటి సందర్భాలలో, తగు చర్య తీసుకొనే నిమిత్తం www.ehf.gov.in పోర్టల్‌లో యూజర్‌ ఐడి, పేరు, అసలు మొబైల్‌ నెంబరు వివరాలను తెలియజేస్తూ ఫిర్యాదు చేయాలి.
ఇచ్చిన యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌లతో నేను లాగిన్‌ కావాలనుకొన్నప్పుడు, 'ఇన్‌వాలిడ్‌ యూజర్‌ ఐడి లేదా పాస్‌వర్డ్‌' అనే హచ్చరిక సందేశం వస్తోంది. నేను ఏమి చేయాలి?
ఇన్‌వాలిడ్‌ యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌ ఏదీ వుండదు. రిజిస్టర్‌ చేసుకొన్న మొబైల్‌కు 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ను ఎస్‌ఎంఎస్‌ చేయటం జరుగుతుంది. ఇమెయిల్‌కు కూడ పంపటం జరుగుతుంది. ఈ 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ "nAI0xQk7"  (కేస్‌ సెన్సిటివ్‌) లా వుంటుంది. దీనిని సరిగా ఎంటర్‌ చేయాలి.

27.పింఛనుదారు దరఖాస్తును ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ కొన్ని రిమార్కులతో తిరస్కరించారు. తిరిగి సమర్పించేందుకు అనుసరించవలసిన ప్రక్రియ ఏమిటి?
రిమార్కుల ప్రకారం సరిచేసి, దానిని వెరిఫికేషన్‌ మరియు అంగీకారం నిమిత్తం తిరిగి సమర్పించాలి.
ధార్‌ కార్డులో వున్న ఉద్యోగి / పింఛనుదారు పేరుకూ సర్వీస్‌ రిజిస్టర్‌ / పిపిఓ కాపీలో వున్న పేరుకూ కొంత వ్యత్యాసం వుంది. నేను ఏ పేరు ఎంటర్‌ చేయాలి?
సర్వీస్‌ రిజిస్టర్‌ / పిపిఓ కాపీలో వున్న పేరు వ్రాయండి.

28. పింఛనుదారులు నమోదయ్యేందుకు చివరి తేదీ ఏది?
పింఛనుదారులు నమోదు అయ్యేందుకు చివరి తేదీ అంటూ ఏదీ లేదు.

29. లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ను ఎప్పుడు పంపుతారు?
దరఖాస్తుదారు రిజిస్టర్‌ చేసుకొన్న మొబైల్‌ నెంబరుకు క్రింద సూచించిన సందర్భాలలో ఎస్‌ఎంఎస్‌ పంపటం జరుగుతుంది.
ఎ). దరఖాస్తుదారు పాస్‌వర్డ్‌ మారుస్తున్నప్పుడు
బి). దరఖాస్తుదారు ''ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌'' ఆప్షన్‌ను ఎంచుకొన్నప్పుడు
సి). పింఛనుదారు దరఖాస్తు సమర్పించినప్పుడు
డి). ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును అంగీకరించినప్పుడు / తిరస్కరించినప్పుడు / నిలిపివేసినప్పుడు

30.మీ సేవ కేంద్రాలలో నమోదు చేయవచ్చా? అవును అయితే, ఎంత రుసుము చెల్లించాలి?
అవును. ఆరోగ్య కార్డుల జారీ నిమిత్తం మీ సేవ కేంద్రాలు నిర్ధారిత రుసుమును స్వీకరిస్తూ, పింఛనుదారుల పేర్లను నమోదు చేయవచ్చునంటూ ప్రభుత్వం / ది డైరెక్టర్‌, ఇఎస్‌డి (మీ సేవ) ఉత్తర్వులను జారీ చేసింది.
ఎ. పింఛనుదారులకు రూ.35
బి. ఆధారపడిన కుటుంబ సభ్యులకు, ఒక్కొక్కరికి, రూ.15
సి. ప్రింట్‌చేసిన దరఖాస్తు ఒక్కొక్క దానికి రూ.2
మీ సేవ కేంద్రాలలో సేవలను పైన సూచించిన రేట్ల ప్రకారం పొందవచ్చు.
ఎస్‌టిఓలు / ఎపిపిఓలు దరఖాస్తుల పరిష్కరణలో ఆలస్యం చేస్తున్నారు.
30.''పెండింగ్‌ విత్‌ డిడిఓ/ఎస్‌టిఓ'' అని చూపుతున్నప్పుడు ఆరోగ్య కార్డుల స్టేటస్‌ ఏమిటి?
ఎస్‌టిఓ/ ఎపిపిఓలను దరఖాస్తులను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆలస్యం జరిగినప్పుడు తగు చర్య నిమిత్తం డిటిఎ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళాలి. స్టేటస్‌ ''పెండింగ్‌ విత్‌ డిడిఓ/ఎస్‌టిఓ'' అని చూపుతుంటే సమస్య ఏమీ వుండదు. పింఛనుదారులు/ ఉద్యోగులు ఆరోగ్య కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని చికిత్స నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. స్పష్టమైన ఆదేశాల తర్వాత సంబంధిత డిడిఓ / ఎస్‌టిఓ పెండింగ్‌ స్టేటస్‌ను క్లియర్‌ చేస్తారు.

      31. ఆరోగ్య కార్డు స్టేటస్‌ను తెలుసుకోవటం ఎలా?
               ఉద్యోగి / పింఛనుదారు హోమ్‌ పేజీలో ఎడమవైపు క్రింద వున్న హెల్త్‌ కార్డ్‌ స్టేటస్‌ టాబ్‌ ద్వారా ఆరోగ్య కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్‌ : www.ehf.gov.in
వైధవ్యం పొందిన / విడాకులు తీసుకున్న మరియు కుటుంబ పింఛనుదారు ఇహెచ్‌ఎస్‌ క్రింద నమోదు అవుతున్నప్పుడు మరణ ధృవీకరణ పత్రం / కోర్టు ఉత్తర్వులను జత చేయాలా?
మరణ ధృవీకరణ పత్రం / కోర్టు ఉత్తర్వులను జత చేయనవసరం లేదు.

32.సమస్యల పరిష్కారానికి కాల వ్యవధిని ఎందుకు సూచించలేదు?
          లబ్ధిదారుల సమస్యలు వేర్వేరుగా వుంటాయి. సాధ్యమైనంత తక్కువ సమయంలో సమస్యను పరిష్కరించటానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం సమస్య పరిష్కారమైన వెంటనే దరఖాస్తుదారుకు జవాబు ఇవ్వటం జరుగుతోంది. అయితే, అందిన మెయిల్‌ను ముందుగా అక్నాలెడ్జ్‌ చేయమనీ, సమస్య పరిష్కారమైన తర్వాత మరొక మెయిల్‌ పంపమనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
 
33.పథకంలో వర్తించే ప్రయోజనాలు ఏమిటి?
1. ఇన్‌ పేషెంట్‌ చికిత్స:
అన్ని ఎంపానెల్డ్‌ ఆసుపత్రులలో అన్ని స్పెషాలిటీల క్రింద పేర్కొన్న చికిత్సలు అందుతాయి. జాబితాను www.ehf.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు
శస్త్రచికిత్స లేదా వైద్య చికిత్సల ఫాలో అప్‌
వ్యాధి నిర్థారణ పరీక్షలు, ఔషధాలు, ఇంప్లాంట్‌లు, కన్స్యూమబుల్స్‌, ఆహారం, ఆపరేషన్‌ / చికిత్స తర్వాత పరిణామాలు, ఫాలో అప్‌ కేర్‌ వంటి వన్నీ ప్యాకేజీలో భాగంగా వుంటాయి.
చివరకు ఐపి ట్రీట్‌మెంట్‌కు దారి తీయని కన్సల్టేషన్‌లు, ఇన్వెస్టిగేషన్‌లతో సహా రోగుల ప్రీ ఇవాల్యుయేషన్‌ కూడ ప్యాకేజీలో భాగంగా వుంటుంది.

2) దీర్ఘకాలిక వ్యాధులకు ఔట్‌ పేషంట్‌ చికిత్స:
 నోటిఫై చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో దీర్ఘకాలిక వ్యాధులకు కన్సల్టేషన్‌, ఇన్వెస్టిగేషన్‌, డ్రగ్స్‌తో సహా చికిత్స వుంటుంది. పూర్తి మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో వుంచటం జరుగుతుంది.

3) వార్షిక ఆరోగ్య పరీక్షలు:
40 సంవత్సరాల వయస్సు దాటిన ఉద్యోగులకు
34. ఆర్థిక వర్తింపు ఎంత వుంటుంది?
ఇహెచ్‌ఎస్‌లో ఎపిసోడ్‌ల సంఖ్యకు పరిమితి ఏదీ లేకుండా, అనారోగ్యపు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2 లక్షల ఆర్థిక పరిమితి వుంటుంది. చికిత్స వ్యయం ఈ పరిధిని మించినప్పుడు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు నగదు రహిత చికిత్సను కొనసాగిస్తాయి. ముందుగా నిర్థారించిన ప్యాకేజీ రేట్లు రూ.2 లక్షలకు మించివున్నప్పుడు ఈ పరిమితి వర్తించదు.


34.ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం వెలుపల తీసుకొనే చికిత్సలకు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందా?
01.12.2014 నుంచి ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల వెలుపల తీసుకొనే చికిత్సలకు రీయింబర్స్‌మెంట్‌ను అనుమతించటం జరగదు.

35.ఆరోగ్యశ్రీ పథకానికి, ఉద్యోగుల ఆరోగ్య పథకానికీ సదుపాయాలు, ఆర్థిక పరిమితుల విషయంలో వ్యత్యాసం ఏమిటి?
                గతంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం పేరును 'డాక్టర్‌ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవ'గా మార్చటం జరిగింది. దారిద్య్ర రేఖకు దిగువన వున్న (బిపిఎల్‌) కుటుంబాలకు కుటుంబం మొత్తానికి సంవత్సరానికి రూ.2.5 లక్షల పరిమితితో, 1038 ప్రొసీజర్స్‌తో ఫ్లోటర్‌ బేసిస్‌లో ఈ పథకం వర్తిస్తుంది. రోగికి ఇన్‌పేషంట్‌ చికిత్సలు జనరల్‌ వార్డులో మాత్రమే లభ్యమవుతాయి. ప్రభుత్వ నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో మాత్రమే చికిత్స అందించేలా 133 ప్రొసీజర్స్‌ను పేర్కొనటం జరిగింది.
అందరు రెగ్యులర్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఎంపానెల్డ్‌ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ (ప్రభుత్వ మరియు ప్రైవేటు)లలో ఎపిసోడ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా, ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.00 లక్షల పరిమితితో నగదు చెల్లింపు లేకుండా చికిత్స అందించేందుకు ఉద్ధేశించినది ఉద్యోగి ఆరోగ్య పథకం. చికిత్స వ్యయం ఒకవేళ రూ.2 లక్షలకు మించినప్పటికీ, నెట్‌వర్క్‌ ఆసుపత్రి సేవలను నిరాకరించకుండా నగదు రహిత చికిత్సను కొనసాగిస్తుంది. ప్రస్తుతం 1885 ప్రొసీజర్స్‌ / థెరపీలకు సంబంధించి, సెమీ ప్రైవేట్‌, ప్రైవేట్‌ వార్డులలో అర్హతకు అనుగుణంగా చికిత్స అందించటం జరుగుతుంది. నోటిఫైడ్‌ ప్రభుత్వ ఆసుపత్రులలో దీర్ఘకాలిక ఓపి వ్యాధులచికిత్స, 40 సంవత్సరాల వయస్సు దాటిన ఉద్యోగులకు వార్షిక ఆరోగ్య పరీక్షలకు కూడ ఈ పథకం వర్తిస్తుంది.

36.ఉద్యోగుల ఆరోగ్య పథకం ఔట్‌ పేషంట్‌ చికిత్సకు వర్తిస్తుందా?
దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే ఔట్‌ పేషంట్‌ చికిత్స నోటిఫైడ్‌ ప్రభుత్వ ఆసుపత్రులలో లభిస్తుంది. వారం రోజుల పాటు మధ్యాహ్నం 2 - 4 గంటల మధ్య, స్పెషల్‌ క్లినిక్‌లలో కన్సల్టెంట్‌ డాక్టర్‌ రోగులను పరీక్షిస్తారు. శాంపుల్‌ కలెక్షన్‌తో క్లినికల్‌ లాబొరేటరీ సేవలు, ఫార్మసిస్ట్‌, రేడియోలజీ, అందుబాటులో వుంటాయి. కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం స్పెషల్‌ క్లినిక్‌లలో ఔషధాలను రోగికి పంపిణీ చేయటం జరుగుతుంది.

37.నేను ఆసుపత్రికి చెల్లింపు చేయవలసి వస్తే, దానిని తిరిగి పొందవచ్చా?
జిఓ ఎంఎస్‌ నెంబర్‌ 134 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, డేట్‌ 29.10.2014 ప్రకారం ఉద్యోగులు / పింఛనుదారుల జీతం / పింఛను నుంచి పథకం నిమిత్తం చందా మొత్తాలను 01.12.2014వ తేదీన చెల్లింపు చేసే నవంబర్‌ 2014 జీతాలు / పింఛను మొదలు మినహాయించటం మొదలవుతుంది. ఎపిఐఎంఎ నియమాలు, 1972 ప్రకారం మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను 01.12.2014 తర్వాత తీసుకొనే చికిత్సలకు అనుమతించటం జరగదు.
38.ఎంపానెల్డ్‌ ఆసుపత్రులు అంటే ఏమిటి?
 
నగదు రహిత చికిత్సలను లబ్ధిదారులకు అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో సర్వీస్‌ ప్రొవైడర్లగా నమోదు అయిన ఆసుపత్రులను ఎంపానెల్డ్‌ ఆసుపత్రులుగా వ్యవహరిస్తారు. ఎంపానెల్డ్‌ ఆసుపత్రుల జాబితా ఇహెచ్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో వుంది.

39.ప్రైవేట్‌ ఆసుపత్రులలో వుండే ఆరోగ్యశ్రీ వార్డులలానే ఇవి కూడా వుంటాయా? లేక ఉద్యోగులు / పింఛనుదారులకు విడిగా వార్డులు వుంటాయా?
  లేదు. ఇహెచ్‌ఎస్‌ క్రింద సెమీ ప్రైవేట్‌, ప్రైవేట్‌ వార్డులను అర్హత ప్రకారం ఇవ్వటం జరుగుతుంది.

40.డబ్బు చెల్లించి చికిత్స పొందే ప్రజానీకంతో సమానంగా ఉద్యోగులకు కూడ చికిత్స అందించటం జరుగుతుందా?
   అవును. డబ్బు చెల్లించి చికిత్స తీసుకొనే రోగులతో సమానంగా చికిత్స అందించటం జరుగుతుంది.

41 . ఒక్కో ఆసుపత్రిలో రోగుల సంఖ్యపై పరిమితి వుందా?
       లేదు. ఆసుపత్రిలో చేర్చుకొనే రోగుల సంఖ్యకు సంబంధించి ఏ విధమైన పరిమితి లేదు. అయితే ఇది ఆసుపత్రిలో అందుబాటులో వున్న బెడ్‌లపై ఆధారపడివుంటుంది.

42.ఇహెచ్‌ఎస్‌లో నగదు రహిత చికిత్సలను పొందేందుకు, ఆసుపత్రులకు వెళ్లే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
            పథకం క్రింద నగదు రహిత చికిత్సలను పొందేందుకు ఆసుపత్రి, అవసరమైన మెడికల్‌ స్పెషాలిటీ ట్రస్ట్‌ క్రింద ఎంపానెల్‌ అయ్యాయో లేదో తెలుసుకోవాలి. సమాచారాన్ని నిర్థారించుకొనేందుకు 104 - సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు. లేదా వెబ్‌సైట్‌ చూడవచ్చు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆసుపత్రి కియోస్క్‌ వద్ద వున్న వైద్య మిత్రకు ఆరోగ్య కార్డు ఇచ్చి రోగి పేరు నమోదు చేయించాలి.

43.ఇహెచ్‌ఎస్‌ క్రింద ఎంపానెల్‌ అయిన ఆసుపత్రులు ఏవి?
ఇహెచ్‌ఎఫ్‌ పోర్టల్‌ (www.ehf.gov.in) లో ఎంపానెల్డ్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల జాబితా అందుబాటులో వుంది. హాస్పిటల్స్‌ టాబ్‌ చూడండి.
 ''ఇహెచ్‌ఎస్‌ ఎంపానెల్డ్‌ హాస్పటల్స్‌ లిస్ట్‌'' పై క్లిక్‌ చేయండి.
ల్యాండింగ్‌ పేజీలో రాష్ట్రం, జిల్లా, స్పెషాలిటీ ఎంచుకోండి.
''సెర్చ్‌''పై క్లిక్‌ చేయండి.
జిల్లాల వారీగా నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌ జాబితా మీకు కనపడుతుంది.

44.నేను ఏయే ఆసుపత్రులలో చికిత్స పొందవచ్చు?
ఎహెచ్‌సిటితో ఎంపానెల్‌ అయిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స తీసుకోవచ్చు. ఆసుపత్రుల జాబితా (www.ehf.gov.in) వెబ్‌సైట్‌లో వుంది.

45.ఎంపానెల్డ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఎవరిని సంప్రదించాలి?
ఆరోగ్యశ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్ట్‌కు సంబంధించిన కియోస్క్‌ ప్రతి ఎంపానెల్డ్‌ ఆసుపత్రిలో వుంటుంది. పథకం క్రింద చికిత్స పొందేందుకు ఆసుపత్రికి వచ్చే ఇహెచ్‌ఎస్‌ రోగికి సహాయం అందించేందుకు అక్కడ 'వైద్య మిత్ర' వుంటారు. ఆరోగ్య కార్డు చూపించిన తర్వాత రోగి పేరు నమోదు చేసుకొని, రోగి చికిత్సకు అవసరమైన చర్యలను వైద్య మిత్ర తీసుకొంటారు.

46.ఎంపానెల్డ్‌ ఆసుపత్రి చికిత్సకు అంగీకరించకపోతే లేదా పక్షపాత ధోరణితో చికిత్స చేస్తే నేనేం చేయాలి?
పోర్టల్‌లో క్రింద సూచించిన ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు :
 ఇహెచ్‌ఎస్‌ పోర్టల్‌ (www.ehf.gov.in) లో లాగిన్‌ కావాలి. .
 ''సైన్‌ ఇన్‌'' పై క్లిక్‌ చేయాలి.
''ఎంప్లాయీ / పెన్షనర్‌''ను ఎంపిక చేసుకోవాలి.
ల్యాండింగ్‌ పేజీలో ''ఎనీ ఇష్యూ / కంప్లయంట్‌''పై క్లిక్‌ చేయాలి.
ఫిర్యాదు వివరాలను పూర్తి చేసి, ''సబ్మిట్‌'' పై క్లిక్‌ చేయాలి.
లేదా
104 - సేవా కేంద్రంకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లోని గ్రీవియన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఈ ఫిర్యాదును పంపించటం జరుగుతుంది.EHS

CFMS విధానంలో మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లులు ట్రెజరీకి సబ్మిట్ చేయడంపై సమగ్ర సమాచారం