INCOMETAX

 INCOMTAX SOFTWARE (3-12-19) - KSS PRASAD

   horizontal design element                    
                          INCOME TAX   2019-20
                                                ఉద్యోగుల ఆదాయపు పన్ను 2019-20 

                                      కేంద్రప్రభుత్వ ఆదాయపు పన్ను చట్టం - 1961 లోని Sec 192 ననుసరించి ప్రతి ఉద్యోగి ఫెన్షనర్ తన వేతన ఆదాయాలను బట్టి ప్రతి సంవత్సరం ఆదాయపు పన్నును చెల్లించాల్సియుంటుంది. కాబట్టి సంబంధిత ఉద్యోగులు/పెన్షనర్లు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అనగా 2020-21 అసెన్మెంట్ ఇయర్లో (అంటే 1-4-2019 నుంది 31-3-2020 వరకు) తమ ఆదాయానికి సంబంధించిన వివరాలు, తగ్గింపుల వివరాలు సంబంధిత డి.డి.ఓ. లకు సమర్పించి ఆదాయపు పన్ను నిబంధనల ననుసరించి ఆదాయపు పన్నును మదింపు చేయాలి..
                         2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక చట్టం2019 ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ ఆదాయపు పన్ను రాయితీకి సంబంధించి సాధారణ ఉద్యోగుల గరిష్ట వార్షిక ఆదాయ పరిమితి రూ. 2,50,000, సీనియర్ సిటిజన్లకు ఆదాయ పరిమితిని రూ. 2,00,000 మరియు వెరీ సీనియర్ సిటిజన్ల ఆదాయ పరిమితిని రూ. 5,00,000 యదావిదిగా కొనసాగించనైనది. ఆదాయపు పన్ను రేట్లలో కూడా ఎలాంటి మార్పులేదు.. మహిళా ఉద్యోగులకు/ మహిళా పెన్షనర్లకు ఈ ఆర్థిక సం॥రం కూడా పన్ను స్లాబులలో ఎలాంటి అదనపు మినహాయింపులు/ రాయితీలు లేవు.
Standard Deductions:-
ఉద్యోగులు, పెన్షనర్లందరికి ఈ ఆర్థిక సంవత్సరం ప్రామాణికతగ్గింపును రూ.40,000/ల నుండి రూ.50,000/- లకు పెంచనైనది. (Sec 16(ia))
సెక్షన్ 87-ఎ క్రింద ఇచ్చే ప్రత్యేక రిబేటును ఈ ఆర్థిక సం.రం నుంది పన్ను విధించదగు ఆదాయం రూ॥ 5,00,000/లోపు గల వారికి రూ. 12,500ల వరకు అనుమతిస్తారు.
 ఈ ఆర్థిక సంవత్సరంలో అనగా 1-4-2019 నుండి 31-3-2020 వరకు ఇంటి లోనును మొదటి సారి తీసుకున్నవారికి ఇంటి విలువ రూ. 45 లక్షల లోపు ఉన్నట్లయితే రూ. 1,50,000/-ల వరకు వడ్డీని అదనంగా మినహాయిస్తారు. (సెక్షన్ 80 EEA)
 ఈ ఆర్థిక సంవత్సరంలో అనగా 1-4-2019 నుండి 31-3-2020 వరకు ఏదైన ఎలక్ట్రిక్ వాహనాన్ని లోనుపై కొనుగోలు చేసినట్లయితే వడ్డీ రూ. 1,50,000/-ల వరకు మినహాయిస్తారు (సెక్షన్ 80 EEB)
 గత సం.రాలకు సంబంధించిన జీతాలు పెన్షన్ బకాయిలను ప్రస్తుత ఆర్థిక సం.రంలో పొందినట్లయితే గతంలో ఈ మొత్తాలపై ఎటువంటి పన్ను చెల్లించకపోతే సదరు ఉద్యోగి/ పెన్షనర్  సెక్షన్ 89 ప్రకారం రిలీఫ్ పొందవచ్చును.
సెక్షన్ 80-సి క్రింద అనుమతించే తగ్గింపుల పరిమితిని రూ 1,50,000 లను యదావిధిగా కొనసాగించనైనది
      వేతన ఆదాయం :
ఎ) క్రింది అంశములకు చెందిన ఆదాయాలు వేతనాదాయంగా పరిగణింపబడతాయి.
1) Pay, 2) ది.ఏ., 3) ఇంటి అద్దె అలవెన్ను (కొన్ని షరతులకు లోబడి) 4) సి.సి.ఏ., 5) తాత్కాలిక భృతి, 6) ప్రోత్సహక ఇంక్రిమెంట్లు, 7) కమీషన్లు, 8) వేతన బకాయిలు, వేతన అడ్వాన్సులు 9) పెన్షన్ 10) సరెండర్ లీవు 11) బోనస్ 12) అదనపు ఆదాయం (Perquisites - రెంట్ ఫ్రీ క్వార్టర్ విలువ, వసతి యొక్క అద్దెలో తగ్గింపు మొదలగునవి). 13) హానరోరియమ్ 14) ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ 15) మెడికల్ రీయింబర్స్మెంట్
బి) వేతనంగా పరిగణింపబడని అంశాలు:
              1) గ్రాట్యుటీ 2) కమ్యుటెడ్ పెన్షన్ 3) ఎల్.టి.సి. 4) పి.ఎఫ్. చెల్లింపులు 5) టూర్ / ట్రాన్స్ఫర్ టి.ఎ. డి.ఎ. 6) రిటైర్ అయిన పిదప లీవ్ ఎన్ క్యాష్మెంట్ 7) కన్వేయన్స్ అలవెన్స్ 8) ఎడ్యుకేషన్ అలవెన్స్
ఇంటి అద్దె అలవెన్స్ మినహాయింపు: సెక్షన్ 10 (133)
1) సెక్షన్ 10 (13ఎ) ప్రకారం హెచ్.ఆర్.ఎ. పొందుతున్న ఉద్యోగి అద్దె ఇంట్లో నివసించుచున్నట్లయితే ఇంటి అద్దెమినహాయింపుగా ఈక్రింది మూడింటిలో అత్యంత తక్కువైన మొత్తం అతని వేతనాదాయం నుంది తగ్గించబడుతుంది.
 ఎ) వాస్తవంగా పొందిన ఇంటి అద్దె అలవెన్సు
బి) వేతనంలో 10 శాతంకంటె అదనంగా చెల్లించిన ఇంటి అద్దె
 సి) వేతనంలో 40 శాతం.
 2) సెక్షన్ 80 (జి) ప్రకారం హెచ్.ఆర్.ఎ. రూపంలో ఎలాంటి అలవెన్సు పొందకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్న వారు (పెన్షనర్లు) ఈ క్రింది మూడింటిలో అత్యంత తక్కువైన మొత్తం అతని వేతన ఆదాయం నుండి తగ్గించబడుతుంది.
ఎ) వేతనంలో 10 శాతంకంటె అదనంగా చెల్లించిన ఇంటి అద్దె
 బి) నెలకు రూ. 5,000/
సి) మొత్తం ఆదాయంలో 25%
గమనిక:- 1. హెచ్.ఆర్.ఎ. నెలకు రూ|| 3000/-పైన పొందుతున్నట్లయితే ఇంటి అద్దె రశీదు జతపరచాలి. అంతకన్నా తక్కువ హెచ్.ఆర్.ఎ. పొందుతున్నవారు ఎలాంటి రశీదు జతపరచనవసరం లేదు. కాని అద్దె చెల్లిస్తున్నట్లు అండర్‌టేకింగ్ యివ్వాలి.
 2) స్వంత ఇల్లు లేదా అద్దె లేని వసతిగృహంలో నివసిస్తున్నవారికి ఇంటి అద్దె మినహాయింపు వర్తించదు.
 Income from self occupied House Property: (సెక్షన్ 24) 1) స్వంత ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించే వడ్డీ పరిమితిని గరిష్టంగా 2013-14 సంవత్సరం వరకు లోను తీసుకున్నవారికి రూ. 1,50,000 ల వరకు మరియు 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి లోను తీసుకున్నవారికి రూ. 2,00,000 ల వరకు మినహాయిస్తారు.
 2) 1-4-2016 నుండి 31-3-2017 వరకు 35 లక్షల లోపు ఇంటి లోన్ మొదటిసారి తీసుకున్నవారికి రూ. 50 వేల వరకు వడ్డీని అదనంగా మినహాయిస్తారు. (సెక్షన్ 80ఇఇ).
3) ఈ ఆర్థిక సంవత్సరంలో అనగా 1-4-2019 నుండి 313-2020 వరకు ఇంటి లోనును మొదటి సారి తీసుకున్నవారికి ఇంటి విలువ రూ. 45 లక్షల లోపు ఉన్నట్లయితే రూ. 1,50,000/ -ల వరకు వడ్డీని అదనంగా మినహాయిస్తారు. (సెక్షన్ 80 EEA).
4) అద్దెకు ఇచ్చినచో, వాస్తవంగా పొందే అద్దె ఆదాయం నుండి (-) నీటి పన్ను, ఇంటి పన్నుల వంటి మున్సిపల్ బాక్సులు మరియు అద్దెద్వారా వచ్చిన ఆదాయంలో 30% వరకు మరమ్మతులు,
మెయింటెనెన్స్ ఖర్చులను తీసివేసి మినహాయింపు పొందాలి.
 తగ్గింపులు (Deductions) :
ఉద్యోగి స్థూల ఆదాయం నుండి హెచ్.ఆర్.ఎ. మినహాయింపు పోను మిగిలిన ఆదాయం నుండి ఈ
క్రింది తగ్గింపులు అనుమతింపబడును..
వృత్తిపన్ను: సెక్షన్ 6(iii): ఉద్యోగి చెల్లిస్తున్న వృత్తి పన్ను మొత్తము
Standard Deductions:- ఉద్యోగులు, పెన్షనర్లందరికి ఈ ఆర్థిక సంవత్సరం నుండి రూ 50,000/- లను వారి వార్షికాదాయం నుండి ప్రామాణిక తగ్గింపును అనుమతిస్తారు. (Sec. 16(1A))
 ఎ. సెక్షన్ 80సి ప్రకారం ఈ క్రింది తగ్గింపులు అనుమతించబడును.
 i) LIC ప్రీమియం (పాలసీ మొత్తంలో 10% గరిష్ట పరిమితి మరియు అంగవికలురు, దీర్ఘతాలిక వ్యాధిగ్రస్తులైతే 15% గరిష్ట పరిమితితో)
 ii) PF చందా
iii) నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (Vii వ ఇష్యూ )
iv) UTI యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్
V) LIC ధనరక్ష మ్యూచువల్ ఫండ్
 vi) అనుమతించబడిన మ్యూచువల్ ఫండ్ (సెక్షన్ 10 (238))
 vii) గృహనిర్మాణము లేక కొనుగోలుకై ప్రభుత్వం / బ్యాంకు / ఎల్.ఐ.సి./ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుండి పొందిన అప్పులను తీర్పుటకు తిరిగి చెల్లించిన అసలు
viii) ట్యూషన్ ఫీ : గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఏ విద్యా సంస్థలకైనా చెల్లించినది.
 ix) ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి
x) అనుమతించబడిన ఇఫ్రాస్ట్రక్చర్ బాండ్స్
xi) పెన్షన్ ఫండ్2
xii) పోస్టాఫీలో లేదా ఏదైన షెడ్యుల్ బ్యాంక్ లో కనీసం 5 సం.లకు ఫిక్స్ చేసిన టర్మ్ డిపాజిట్లు. xiii) సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, 2004
బి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన న్యూ పెన్షన్ స్కీంకు చెల్లించిన కంట్రిబ్యూషన్ (సెక్షన్ 80సిసిసి) రూ. 1,50,000 వరకు ఉదా: ఎల్.ఐ.సి. జీవన సురక్ష
సి. నూతన పెన్షన్ స్కీంకు వేతనములలో చెల్లించిన 10%ప్రీమియం (సెక్షన్ 80సిసిడి (1)
 డి. నూతన పెన్షన్ స్కీంకు ప్రభుత్వంచే చెల్లించబడిన వేతనంలో 10% మ్యాచింగ్ కంట్రిబ్యూషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14% మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ (సెక్షన్ 80 సిసిడి(2)) గమనిక: 1) 80సి, 80 సిసిసి, 80సిసిడి (1) ల క్రింద తగ్గింపుల మొత్తం రూ. 1,50,000 గరిష్ట పరిమితికి లోబడి వుంటుంది (సెక్షన్ 80 సిసిఇ)
   సెక్షన్ 80-సిసిడి (12) ప్రకారం జాతీయ పెన్షన్ పథకంకు వేతనాలలో అదనంగా 50,000 ల వరకు కాంట్రిబ్యూషన్  మినహాయింపును కొనసాగిస్తారు.
ఇ. మెడికల్ ఇన్సురెన్స్ ప్రీమియం : (సెక్షన్ 80డి)
1) ఉద్యోగి, ఉద్యోగి భార్య/భర్త ఆధారిత పిల్లలు, తల్లిదండ్రులకై చెల్లించిన ప్రీమియంకు మొత్తము రూ. 25 వేల గరిష్ట పరిమితితో తగ్గింపు
 2) సీనియర్ సిటిజన్, భార్య/భర్త, ఆధారిత పిల్లలు, తల్లిదండ్రులకై చెల్లించిన ప్రీమియం మొత్తము రూ. 50,000 వేల గరిష్ట పరిమితితో తగ్గింపు
3) ఉద్యోగి, భార్య / భర్త మరియు ఆధారితులు ప్రివెంటివ్ హెల్త్ చెక్ఆప్ నిమిత్తం రూ 5000 ల వరకు పైన పేర్కొన్న గరిష్ట - పరిమితిలకు లోబడి పన్ను నుండి మినహాయించ బడుతుంది.
 యఫ్. వికలాంగులైన ఆధారితుల ఖర్చు (సెక్షన్ 80 డిడి) :
మానసిక లేక శారీరక వైకల్యం గల ఆధారితుల వైద్యం, పోషణ - మరియు నిర్వహణకై చేసిన ఖర్చులను 1) 40% కంటే ఎక్కువ వైకల్యం - వుంటే రూ. 75,000 గరిష్ట పరిమితితో 2) 80% కంటే ఎక్కువ - వైకల్యం వుంటే రూ. 1,25,000 గరిష్ట పరిమితితో తగ్గింపబడుతాయి.
జి. వైద్య చికిత్సకై ఖర్చులు (సెక్షన్ 80 డిడిబి):
ఉద్యోగి న్వంత విషయంలో గాని, ఆధారవడిన - కుటుంబీకులకుగాని కేన్సర్, ఎయిడ్స్ లాంటి తీవ్ర రోగాల చికిత్సకై
చేసిన వాస్తవ వైద్య ఖర్చుల నుండి రూ. 40,000 వరకు, సీనియర్ - సిటిజన్లు మరియు వెరీ సీనియర్ సిటిజన్లకు రూ. 1,00,000 మినహాయింపు గలదు. ఈ సదుపాయం పొందగోరు వారు సంబంధిత ట్రీట్మెంట్ డాక్టర్ బిల్లులు సమర్పిస్తే సరిపోతుంది.
హెచ్. ఎడ్యుకేషన్ లోను (క్షన్ 802):
      ఉద్యోగి, భార్య/భర్త, పిల్లల చదువుల కోసం ఏదైన ఛారిటబుల్స్, ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీని పూర్తిగా ఆదాయం నుండి 8 ఏళ్ళ వరకు లేదా అప్పు తీరే వరకు ఏది ముందైతే అప్పటి వరకు తగ్గించబడుతుంది.
 ఐ. విరాళములు (సెక్షన్ 80జి)
1) డ్రగ్స్ నియంత్రణ నిధి, ప్రధానమంత్రి జాతీయ సహాయక నిధి. ప్రధానమంత్రి భూకంప సహాయ నిధి, జాతీయ బాలల - నిధి. జాతీయ మత సామరస్య నిధి, యూనివర్సిటీలు లేదా అర్హత వున్న జాతీయ విద్యా సంస్థలకు యిచ్చిన విరాళాలు, ఆం.ప్ర. ముఖ్యమంత్రి తుఫాను సహాయ నిధికి, జిల్లా సాక్షరతా సమితికి, జాతీయ క్రీడల నిధికి యిచ్చిన విరాళాలు, మొత్తము ఆదాయం నుండి 100 శాతం తగ్గించబడును.
2) ప్రధానమంత్రి కరువు సహాయ నిధికి, రాజీవ్ గాంధీ పౌండేషన్, ఇందిరాగాంధీ స్మారక నిధి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, ప్రత్యేక మినహాయింపు పొందిన దేవాలయం, మసీదు, - చర్చీల వంటి మత సంస్థలకు, మసీదుల పునర్నిర్మాణము, రిపేర్లకు యిచ్చిన విరాళములలో 50% ఆదాయం నుండి తగ్గించబడును..
ఇట్టి విరాళములు రూ. 2,000 కంటే ఎక్కువ చెల్లించినట్లయితే చెక్కు / డి.డి. రూపములో చెల్లించాలి.
జె. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ
 బ్యాంకు - పోస్టాఫీసులలో సేవింగ్స్ ఖాతా డిపాజిట్ల ద్వారా - పొందిన వడ్డీ రూ .10,000 గరిష్ట పరిమితితో ఆచాయపు పన్ను నుండి మినహాయించబడుతుంది. (సెక్షన్ 80 టిటిఎ)
 బ్యాంకు - పోస్టాఫీసులలో సేవింగ్స్ ఖాతా మరియు ఫిఫ్ట్ - డిపాజిట్ల ద్వారా పొందిన వడ్డీ సీనియర్ సిటిజన్లకైతే రూ. 50,000 గరిష్ట పరిమితితో ఆదాయపు పన్ను నుండి మినహాయించబడుతుంది. - (సెక్షన్ 80 టిటిబి)
 కె. వికలాంగుదైన ఉద్యోగికి ప్రత్యేక తగ్గింపు (సెక్షన్ 80యు) :
        వైద్యాధికారి ఇచ్చిన ధృవపత్రమును బట్టి 40% కంటే ఎక్కువ వైకల్యంగలవారికి రూ॥ 75,000 వరకు, 80% కంటే ఎక్కువ వైకల్యం - ఉన్న వారికి గరిష్టంగా 1.25 లక్ష రూపాయలు మినహాయింపు గలదు.
పన్ను విధించదగు ఆదాయం :
       ఉద్యోగి మొత్తం ఆదాయం నుంది. హెచ్.ఆర్.ఏ. • మినహాయింపు మరియు పైన పేర్కొనబడిన తగ్గింపులు పోను మిగిలిన ఆదాయం పన్ను విధించదగు ఆదాయంగా పరిగణించబడుతుంది. క్రింది రేట్ల ప్రకారం ఈ ఆదాయంపై పన్ను లెక్కించవలసియుంటుంది.
·                   పై రేట్ల ప్రకారం ఆదాయపు పన్ను లెక్కించి, పన్ను విధించదగు ఆదాయం రూ॥ 5 లక్షల లోపు గల వారికి రూ. 12,500/- లు గరిష్ట పరిమితితో పన్నులో ప్రత్యేక రిబేటు ఇస్తారు. (సెక్షన్ 873) + 50 లక్షల నుండి కోటి రూపాయల ఆదాయం గల వారికి ఆదాయపు పన్నుపై అదనంగా 10% సర్చార్టి మరియు ఒక కోటి కంటె ఎక్కువ ఆదాయంగలవారికి సర్చార్జి 15% విధించబడుతుంది. . ఆదాయపు పన్నుపై అదనంగా 4% ఆరోగ్యం మరియు విద్యా సెన్సును  చెల్లించాలి.
  ఇన్‌కంటాక్స్ రిటర్స్:
        పన్ను విధించదగు ఆదాయం రూ॥ 2.5 లక్షలకంటే తక్కువగల ఉద్యోగులు ఎలాంటి రిటర్న్స్ సమర్పించవలసిన అవసరం లేదు. కాని ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20 నకు సంబంధించి తన ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను నిర్ణిత ప్రోఫార్మ నెం. 16 లో సంబంధిత డ్రాయింగ్ అధికారికి సమర్పించవలెను. ఆదాయపు పన్నును లెక్కించి మార్చి 31లోగా చెల్లించాలి. లేదా ఆ పన్ను నుండి మినహాయింపు పొందుటకు అవసరమైన మొత్తమును వివిధ పొదుపు పథకములలో ఉంచి మినహాయింపు పొందాలి.

           డ్రాయింగ్ అధికారుల పరిధిలో లేని మినహాయింపులు 
        Sec. 80G మరియు Sec. 80DDB క్రింద జమచూపే మినహాయింపులు డ్రాయింగ్ అధికారులు అనుమతించకూడదని, అవి Income Tax Department యొక్క Assessing అధికారులు Income Tax return (Sahaj)ను జులైలో సమర్పించేటపుడు మాత్రమే అనుమతించి, అధికముగా చెల్లించిన మొత్తమును Refund ఇసారని I.T. Department - DTA/DDOలకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినది. (vide E.No. TDS/clarification/1011 dt. 15.12.11 of Addl. Commissioner I. T. Dept., Hyderabad)
  Sec.80G:P.M. రిలీఫ్ ఫండ్,C.M. రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు తప్ప 80G క్రిందకు వచ్చే 50%/30% మినహాయింపు పరిధిలోకి వచ్చే  ఇతర చందాలను DDO అనుమతించరాదు.- గమనిక:-80G మినహాయించకముందునికర ఆదాయములో 10% కన్నా ఎక్కువ సొమ్మును 80G క్రింద వర్తించే చందాలుగా అనుమతించరాదు.
  80 DDB :-- Cancer, Talassemia, Haemophilia, Nuerolological disleases,Aids మరియు ChronicrenalFailure వంటి ప్రాణాంతక వ్యాధులతో సంబంధిత ఆర్థిక సం.లో బాధపడుచున్నవారు మరియు వారిపై ఆధారపడిన తల్లితండ్రిభార్య/భర్తపిల్లలుసోదరుడుసోదరి వారికి వైద్యఖర్చుల నిమిత్తము రు.60,000/(60 సంపైబడితే రు. 80,000/-) వరకు సెక్షన్ 80DDB కింద మినహాయింపు కలదు
Form 10-I లో ప్రభుత్వ Hospital లో పనిచేసే Specialist Doctors చే ఖర్చుల వివరములతో సహా గల ధృవపత్రము ఉంటేనే  మినహాయింపు
 వరిస్తుంది మినహాయింపు IT Dept. Assesing Officer పరిధిలోనిది. (DDO పరిధిలోకి తెచ్చుటకు ప్రాతినిధ్యం చేయాలి).
horizontal design element


Income Tax  Software 2018-19 (24-11-2018) C.Ramanjaneyulu

INCOMETAX ACT 2018-19 -   Corcular 1/2019IT DEPT 


 ఉద్యోగుల ఆదాయపు పన్ను 2018-19
 కేంద్రప్రభుత్వ ఆదాయపు పన్ను చట్టం - 1961 లోని సెక్షన్ 192 ననుసరించి ప్రతి ఉద్యోగి తన వేతన ఆదాయాలను బట్టి ప్రతి సంవత్సరం ఆదాయపు పన్నును చెల్లించాల్సియుంటుంది. 2018-19 ఆర్ధిక సంవత్సరం 12 నెలల వేతనము, ఇతర ఆదాయాల మొత్తుపై ఆదాయపుపన్ను నిబంధనలననుసరించి పన్నును మదింపు చేయాలి.
               2018-19 ఆర్థికసంవత్సరానికి సంబంధించి ఆర్థికచట్టం 2018 ప్రకారంగత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయపు పన్ను నిశింగనలలో కొన్ని మార్పులు చేయడం జరిగింది.
1.ఆదాయపు పన్ను శ్లాబ్లలో ఎలాంటి మార్పు లేదు.
2.ఆదాయపు పన్ను రాయితీకి సంబంధించి సాధారణ ఉద్యోగుల గరిష్ణ వార్షిక ఆదాయ పరిమితి రూ. 2,50,000, సీనియర్ సిటీజన్లకు ఆదాయ పరిమితిని రూ.3,00,000 మరియు వెరీ సీనియర్ సిటిజన ఆదాయ పరిమితిని రూ. 5,00,000 కొనసాగించటమైనది
3.ఆదాయపు పన్నుపై 4% విద్యా సెస్సు. విధించబడుతుంది
4. సెక్షన్ 80-సీ క్రింద అనుమతించే తెగింపుల పరిమితినిరూ. 1,50,000 లను యథావిధిగా కొనసాగించటమైనది.
5.సెక్షన్ 80-సి క్రింద సుకన్య సంవృద్ధి పథకంలో రూ1.50,010) గరిష్ట పరిమితికి లోబడి పొదుపు చేసుకునే అవకాశం కొనసాగించటమైనది.
6.సెక్షన్ 80-Rడి (1) ప్రకారం జాతీయ పెన్షన్ పధకంకు వేతనాలలో అదనంగా 50,000 ల వరకు కాంట్రిబ్యూషన్ మినహాయింపును కొనసాగిస్తారు.
7సెక్షన్ 80-డి, 4-డిడి, 80-డిడిబి, 80-యు క్రింద ఇచ్చే మినహాయింపులలో  మార్పులేదు.
8.జీతం తీసుకొనే ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపు 40000 వరకు అనుమతింపబడుతుంది
వేతనఆదాయం:  క్రింది అంశములకుచెందిన ఆదాయలు వేతనాదాయంగా  పరిగణింపబడతాయి
     1) పే2) డి.., 3) ఇంటి అద్దె అలవెన్ను కొన్ని షరతులకు లోబడి.), 4) సి.సి..,5తాత్కాలిక భృతి, 6) ప్రోత్సహక ఇంక్రిమెంటు,7} కమీషన్లు, 8) వేతన బకాయిలువేతన అడ్వాన్సులు 9) పెన్షన్ 10) సరెండర్ లీపు 11) బోనస్, 12) అదనపు ఆదాయం (Perquisites - రెంట్ ప్రీక్వార్టర్ విలువవసతి యొక్క అద్దె లో తగ్గింపు మొదలగునవి13) హాసరోరియమ్ 14) ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్15) బ్యాంక్ డిపాజిట్స్, NSC సర్టిఫికెట్లపై వడ్డీ
వేతనంగా పరిగణింపబడని అంశాలు:
1) గ్రాట్యుటీ 2) కమ్యుటెడ్ పెన్షన్ 3) ఎల్టి సి 4) పిఎస్చెల్లింపులు 5) టూర్ ట్రాన్స్ ఫర్ టి.ఎ డి.ఎ, 6} రిటైర్ అయిన పిదప లీప్ ఎస్ క్యాష్మంట్ 7) కన్వేయన్స్ అలవెన్స్ 8) మెడికల్ రీయింబర్స్ మెంట్ 9) ఎడ్యుకేషన్ అలవెన్స్) సేవింగ్స్ ఖాతాపై  వడ్డీ 10 వేల వరకు
ఇంటి అద్దె అలవెన్స్10 మినహాయింపు : సెక్షన్ 10 (13A) ఉద్యోగిఅద్దె ఇంట్లో నివసించుచున్నట్లయితే ఇంటి అద్దె మినహాయింపుగా ఈ క్రింది మూడింటిలో అత్యంత తక్కువైన మొత్తం అతని వేతనాదాయం నుండి తగ్గించబడుతుంది.
ఎ) వాస్తవంగా పొందిన ఇంటి అద్దె అలవెస్సు
బి) వేతనంలో 10 శాతంకంటే అదనంగా చెల్లించిన ఇంటిఅద్దె
సి) వేతనంలో 40 శాతంగమనిక :- 1 సం. నకు రూపాయలు లక్ష (నెలకు 8,333/-) లకు పైగా ఇంటి అద్దె చెల్లించేవారు, ఇంటి అద్దె రశీదుతోపాటు ఇంటి యజమాని పాన్ నెంబర్ తెలపాలి.
Income from Self occupied House Property: (సెక్షన్ 24) 1.U/s 24(2) : 01-04-1999  తరువాత తీసుకొన్న ఇంటి అప్పుపై చెల్లించిన వడ్డీ  గరిష్టంగా రూ. 2,00,000 లు ఉంటుంది..
2) 1-4-2016 నుండి 31-3-2017 వరకు 35 లక్షల లోపు ఇంటి లోన్ మొదటి సారి తీసుకున్నవారికి రూ50 వేల వరకు వడ్డీ ని అధనంగా మినహాయిస్తారు. (సెక్షన్ 80 ఇఇ)
3} అద్దెకు ఇచ్చినచోవాస్తవంగా పొందే ఇంటిఆదాయం నుండి నీటి పన్నుఇంటిపన్నుల వంటి మున్సిపల్ టాక్సులు మరియు అద్దె ద్వారా వచ్చిన ఆదాయంలో 30% వరకు మరమ్మతులుమెయింటెనెన్స్ ఖర్చులను తీసివేసి మినహాయింపు పొందాలి.
తగ్గింపులు(Deductions) : ఉద్యోగి స్థూల ఆదాయం నుండి హెచ్.ఆర్.మినహాయింపు పోను మిగిలిన ఆదాయం నుండి ఈ క్రింది తగ్గింపులు అనుమతింపబడును,
వృత్తిపన్నుసెక్షన్ 16(ii): ఉద్యోగి చెల్లిస్తున్న వృత్తి పన్ను మొత్తము
చాప్టర్ VI-A క్రింద తగ్గింపు : సెక్షన్ 80సీ ప్రకారం ఈ క్రింది తగ్గింపులు అనుమతించబడును.
  i) LIC ప్రీమియం (పాలసీ మొత్తంలో 10% గరిష్ట పరిమితి మరియు అంగవికలురు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైతే 15% గరిష్ట పరిమితి)
ii) PT చందా 
iii) నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ viii వ ఇష్యూ
iv) UTI యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్ 
V) LIC ధనరక్ష మ్యూచువల్ ఫండ్ 
vi)అనుమతించబడిన మ్యూచువల్ ఫండ్ (సెక్షన్ 10 (23D )
 vii) గృహనిర్మాణము లేక కొనుగోలుకై ప్రభుత్వం బ్యాంక్ లు ఎల్.సీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుండి పొందిన అప్పును ను తీర్చుటకు తిరిగి చెల్లించిన అసలు
viii) ట్యూషన్ ఫీ గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఏ విద్యా సంస్థలకైనా చెల్లించినది
ix} ఈక్విటీ లింకిడ్ సేవింగ్స్ స్కీమ్లలో పెట్టుబడి 
xఅనుమతించబడిన ఇన్ఫ్రాస్టక్చర్ బాండ్స్
xi} పెన్షన్ ఫండ్ 
xii) పోస్టాఫీస్లో లేదా ఏదైన షెడ్యుల్ బ్యాంక్లో కనీసం సం.లకు ఫిక్స్డ్ చేసిన టర్మ్ డిపాజిట్
xiii) సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్2004 . కేంద్ర ప్రభుత్వం అనుమతించిన న్యూ పెన్షన్ స్కీంకు చెల్లించిన కంట్రిబ్యూషన్ (సెక్షన్ 80P) రూII 1,50,000 వరకు ఉదా: ఎల్.సిజీవన సురక్ష సూతన పెన్షన్ స్కీంకు వేతనములలో చెల్లించిన 10%ప్రీమియం) సెక్షన్ 80సిసిడి.
XIV) , నూతన పెన్షన్ స్కీంకు ప్రభుత్వం చెల్లించబడిన వేతనంలో 10% మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ (సెక్షన్ 80 సిసిడి  గమనిక1) 80సి, 80 సిసి, 80సిసిడి(1) ల క్రింద తగ్గింపుల మొత్తం రూ 1,50,000 గరిష్ట పరిమితికి లోబడి వుంటుంది సెక్షన్8) సినిఇ.
 మెడికల్ ఇన్సురెన్స్ ప్రీమియం :(సెక్షన్ 80డీ
 1} ఉద్యోగిఉద్యోగి భార్య/భర్త ఆధారిత పిల్లలుతల్లిదండ్రులకై చెల్లించిన ప్రీమియంకు మొత్తము రూ25 వేల గరిష్ట పరిమితితో తగ్గింపు,
2) సీనియర్ సిటిజన్, భార్యభర్తఆధారిత పిల్లలు, తల్లిదండ్రులకై చెల్లించిన ప్రీమియం మొత్తము రూ 30, 000 వేల గరిష్ట పరిమితితో తగ్గింపు
3) ఉద్యోగిభార్యభర్త మరియు ఆధారితులు ప్రివెంటివ్ హెల్త్ చెక్అప్ నిమిత్తం రూ 5000 ల వరకు పైన పేర్కొన్న గరిష్ట పరిమితీలకు లోబడి పన్ను నుండి మినహాయించబడుతుంది.
4)EHS క్రింద మినహాయింపులు 90/120 ఈ సెక్షన్  క్రింద వస్తాయి.
వికలాంగులైన ఆధారితుల ఖర్చు సెక్షన్80 డిడి:
      మానసిక లేక శారీరక వైకల్యం గల ఆధారితుల వైద్యంపోషణ మరియు నిర్వహణకై చేసిన ఖర్చులను 1) 40% కంటే ఎక్కువ వైకల్యంవుంటే రూ 50,000 గరిష్ట పరిమితితో  2) 60 కంటే ఎక్కువ వైకల్యం వుంటే రూ1,00,000 గరిష్ఠ పరిమితిలో తగ్గింపబడుతాయి.
వైద్య చికిత్సకై ఖర్చులు సెక్షన్ 80 డిడిబి   U/s 80DDB )క్రింద తనకు లేదా తనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు క్యాన్సర్, ఎయిడ్స్కిడ్సీ ఫెయిల్యూర్మొదలగు రూల్ 11DD ప్రకారం గుర్తించబడిన ఇతర వ్యాధుల చికిత్సకు అయిన ఖర్చు గరిష్టము రూ40,000 సీనియర్ సిటిజన్ కు గరిష్టం రూ.80,000/- Certificate in form 10-1లో సమర్పించాలిఈ మినహాయింపు అధికారం డ్రాయింగ్ అధికారికి లేదుమొదట పన్ను కట్టి ఐటీ శాఖవారికి రిటర్న్ దాఖలు చేసి రీఫండ్ తెప్పించుకోవాలి.
హెచ్ఎడ్యుకేషన్ లోనుసెక్షన్ 80E : ద్యోగిభార్యభర్తపిల్లల చదువుల కోసం ఏదైన ధారిటబుల్స్ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న అసలు చెల్లించిన వడ్డీని పూర్తిగా ఆదాయం నుండి ఏళ్ళ వరకు లేదా అప్పు తీరే వరకు ఏది ముందైతే అప్పటి వరకు తగ్గించబడుతుంది.
 5. విరాళములు (సెక్షన్ 80 జి)
1) డ్రగ్స్ నియంత్రణ నిధి. ప్రధానమంత్రి జాతీయ సహాయక నిధిప్రధానమంత్రి భూకంప సహాయ నిధిజాతీయ బాలల నిధిజాతీయ మత సామరస్య నిధియూనివర్సిటీలు లేదా అర్హత వున్న జాతీయ విద్యా సంస్థలకు ఇచ్చిన విరాళాలుAP ముఖ్యమంత్రి తుఫాను సహాయ నిధికిజిల్లా సాక్షరతా సమితికిజాతీయ క్రీడల నిధికి యిచ్చిన విరాళాలుమొత్తము ఆదాయం నుండి 100 శాతం తగ్గించబడును
2) ప్రధానమంత్రి కరువు సహాయ నిధీకిరాజీవ్ గాంధీ ఫౌండేషన్ఇందిరాగాంధీ స్మారక నిధిప్రత్యేక మినహాయింపు పొందిన దేవాలయంమసీదుచర్చీల వంటి మత సంస్థలకుమసీదుల పునర్నిర్మాణమురిపేర్లకు య్చిన విరాళములలో 50% ఆదాయం నుండి తగ్గించబడుమ * ఇట్టి విరాళములు రూ.2,000 కంటే ఎక్కువచెల్లించినట్లయితే చెక్కు డి డి రూపములో చెల్లించాలి. విరాళం ఆదాయంలో  10%శాతం మించరాదు.
 జెసేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ (సెక్షన్ 80 టిటిఎ) బ్యాంకు పోస్టాఫీసులలో సేవింగ్స్ ఖాతా డిపాజిట్ల ద్వారా పొందిన వడ్డీ రూ 10,000 గరిష్ట పరిమితితో ఆదాయపు పన్ను మండి మినహాయించబడుతుంది80TTB  సీనియర్ సిటిజన్స్ అయితే 50000/-
జెవికలాంగుడైన ఉద్యోగికి ప్రత్యేక తగ్గింపు (సెక్షన్ 80యు) : వైద్యాధికారి ఇచ్చిన ధృవపత్రమును బట్టి 40% కంటే ఎక్కువ వైకల్యం గల వారికి రూ75,000 వరకు, 80% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి గరిష్టంగా 1.25 లక్ష రూపాయలు మినహాయింపు గలదు.                              పై  స్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను లెక్కించి, 3.5 లక్షల లోపు ఆదాయం గల వారికి రూ 2,500/- లు గరిష్ట పరిమితితో పన్సులో ప్రత్యేక రిబేటు ఇస్తారు

horizontal design element

TAX RATES -SLABS AY 2018-19

1. Income Tax Slab Rate for AY 2018-19 for Individuals:

1.1 Individual (resident or non-resident), who is of the age of less than 60 years on the last day of the relevant previous year:


Taxable income
Tax Rate
Up to Rs. 2,50,000
Nil
Rs. 2,50,000 to Rs. 5,00,000
5%
Rs. 5,00,000 to Rs. 10,00,000
20%
Above Rs. 10,00,000
30%

1.2 Resident senior citizen, i.e., every individual, being a resident in India, who is of the age of 60 years or more but less than 80 years at any time during the previous year:


Taxable income
Tax Rate
Up to Rs. 3,00,000
Nil
Rs. 3,00,000 - Rs. 5,00,000
5%
Rs. 5,00,000 - Rs. 10,00,000
20%
Above Rs. 10,00,000
30%

1.3 Resident super senior citizen, i.e., every individual, being a resident in India, who is of the age of 80 years or more at any time during the previous year:


Taxable income
Tax Rate
Up to Rs. 5,00,000
Nil
Rs. 5,00,000 - Rs. 10,00,000
20%
Above Rs. 10,00,000
30%

Plus:
Surcharge: 10% of tax where total income exceeds Rs. 50 lakh

                 15% of tax where total income exceeds Rs. 1 crore



Education cess: 3% of tax plus surcharge 


Note: A resident individual is entitled for rebate u/s 87A if his total income does not exceed Rs. 3,50,000. The amount of rebate shall be 100% of income-tax or Rs. 2,500, whichever is less.
horizontal design element


INCOME TAX SOFTWARE BY KSS PRASAD AS ON FEB 4,2018
IT Software 2017-18- KSS Prasad as on  23-01-2018

















 For individuals below the age of 60 and HUF:

Income Tax SlabsIncome Tax Rates
Total income less than Rs.2,50,000.-NIL-
Total income greater than Rs.2,50,000 but less than Rs.5,00,000.10% of the amount by which it exceeds Rs.2,50,000.
Total income greater than Rs.5,00,000 but less than Rs.10,00,000.20% of the amount by which it exceeds Rs.5,00,000.
Total income greater than Rs.10,00,000.30% of the amount by which it exceeds Rs.10,00,000.

For all individuals above the age of 60 – Senior Citizens


Income Tax SlabsIncome Tax Rates
Total income less than Rs.3,00,000.-NIL-
Total income greater than Rs.3,00,000 but less than Rs.5,00,000.10% of the amount by which it exceeds Rs.3,00,000.
Total income greater than Rs.5,00,000 but less than Rs.10,00,000.20% of the amount by which it exceeds Rs.5,00,000.
Total income greater than Rs.10,00,000.30% of the amount by which it exceeds Rs.10,00,000.

TAX కు సంబంధించిన కొన్ని సందేహాలు - సమాధానాలు
1.నేను 2016-17 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేయలేదు. డిసెంబరు 2016లో రూ.2,15,000 ఒకేసారి బ్యాంకులో జమ చేశాను. ఆ వివరాలు రిటర్నులో పేర్కొనాల్సి ఉంటుందని అన్నారు. అసలు సమర్పించకపోతే సరిపోతుంది కదా అనుకున్నాను. కానీ, ఇటీవల నాకు ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నుంచి తరచూ సందేశాలు, ఈమెయిళ్లు వస్తున్నాయి. నా మొత్తం ఆదాయం రూ.4లక్షలు. ఆదాయపు పన్ను రూ.5,300 చెల్లించాను. రిటర్నులు దాఖలు చేస్తే ఏదైనా సమస్య వస్తుందా?
          జవాబు :మీ ఆదాయం కనీస పరిమితి (రూ.2,50,000) దాటినప్పుడు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువు తేదీ దాటినప్పటికీ.. ఈ రిటర్నులను మార్చి 31, 2018 సమర్పించేందుకు అవకాశం ఉంది.ఈలోపు మీరు రిటర్నులు దాఖలు చేస్తే ఎలాంటి అపరాధ రుసుము విధించరు. మీరు ఒకేసారి జమ చేసిన నగదు రూ.2,15,000 గురించి కూడా రిటర్నులలో పేర్కొనాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన తగిన ఆధారాలు సేకరించి పెట్టుకోండి.

2.2016లో ఒక ప్లాటు అమ్మాను. దానికి సంబంధించి రూ.9లక్షలు చెక్కు రూపంలో వచ్చాయి. అప్పటి నుంచి ఆ డబ్బు అలాగే బ్యాంకు పొదుపు ఖాతాలో ఉంది. ఆ డబ్బును వెనక్కి తీసుకునేందుకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందా? కచ్చితంగా మరో ప్లాటు కొనాలా?
       జవాబు :ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక ప్లాటు అమ్మినప్పుడు.. మీరు కొన్న తేదీ నుంచి ఆ ప్లాటు కొని మూడేళ్లు గడిస్తే.. దీర్ఘకాలిక మూలధన రాబడిని గణించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. మీకు ఆ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆదాయాలతో కలిపి, రిటర్నులు దాఖలు చేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం దీర్ఘకాలిక మూలధన రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్లాటు అమ్మిన తేదీకి ముందు ఉన్న 12 నెలల్లో ఫ్లాటు లేదా ఇల్లు కొని ఉంటే.. చట్టప్రకారం మినహాయింపు పొందే వెసులుబాటు ఉంది. గడువు తేదీ దాటింది కాబట్టి, ప్రస్తుతం పెట్టుబడి పెట్టేందుకు మీకు అవకాశం లేదు. రిటర్నులు దాఖలు చేసి, వర్తించే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

3.నేను ప్రభుత్వ ఉద్యోగిని. షేర్లలో కూడా పెట్టుబడి పెడుతుంటాను. నా ఫారం-16లో ఈ విషయాన్ని నేను పేర్కొనలేదు. రిటర్నులు దాఖలు చేసేప్పుడు నేను కచ్చితంగా నాకు వచ్చిన లాభనష్టాలను చూపించాల్సి ఉంటుందా? దీనివల్ల నాకు ఏదైనా ఇబ్బంది వస్తుందా?
జవాబు :ఆదాయ పన్ను ప్రస్తుత నిబంధనల ప్రకారం షేర్లలో జరిపే లావాదేవీలన్నీ కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. మీరు జరిపిన లావాదేవీల రికార్డులన్నీ కూడా ఆదాయపు పన్ను శాఖకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి, మీరు రిటర్నులు దాఖలు చేసేప్పుడు ఈ వ్యవహారాలన్నీ రిటర్నులలో పేర్కొనండి. మీ జీతం, షేర్లలో వచ్చిన లాభనష్టాలను తెలియజేస్తూ రిటర్నులు దాఖలు చేయడం ఉత్తమం.

4.నాకు మా పుట్టింటి నుంచి గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా ఒక ఇల్లు వచ్చింది. ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంది. దీన్ని అమ్మినప్పుడు, వచ్చిన మొత్తాన్ని నేను ఆదాయం పన్ను రిటర్నులలో చూపించాలా? నేను ఉద్యోగం చేస్తున్నాను. ఇలాంటప్పుడు నాకు అధిక పన్ను భారం లేకుండా ఏం చేయాలి?
           జవాబు :అమ్మిన ఇల్లు.. గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా వచ్చినప్పటికీ.. వాస్తవ కొనుగోలు తేదీ నుంచి మూడేళ్లు దాటితే దాన్ని దీర్ఘకాలిక ఆస్తిగానే చట్టం పరిగణిస్తుంది. దానిపై వచ్చిన రాబడిని దీర్ఘకాలిక మూలధన లాభంగా చూపించి, వర్తించే పన్ను చెల్లించాలి. మీరు ఈ 2017-18 ఆర్థిక సంవత్సరంలో అమ్మి ఉంటే... జులై 31, 2018లోపు మరో ఇల్లు లేదా ఫ్లాటుపై పెట్టుబడి పెట్టడం ద్వారా పూర్తి మినహాయింపు పొందవచ్చు.
5.మెడికల్ ఇన్సురెన్స్ (80D) : 
                ఉద్యోగి తన కుటుంబంకోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగి పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- పేరెంట్స్ లో ఒక్కరు సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 30,000/- మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి కాని కుటుంబం కోసం కాని పేరెంట్స్ కోసం కాని హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు.కన్వేయన్స్ అలవెన్స్ కి పూర్తిమినహాయింపు. వృత్తి పన్ను కు కూడాపూర్తిగా మినహాయింపు కలదు.
6.ఆదాయపు పన్ను చెల్లించె వ్యక్తీ వికలాంగులయితే (80U) :
ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-,
80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి.
7.అనారోగ్యానికి చికిత్సకు అయిన ఖర్చు (80DDB) : 
          ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Hemophilia, Talassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 80,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత  స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి.కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.
7.చందాలు (80G) :
PM, CMరిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు మినహా , 80G క్రిందకు వచ్చే 50%/30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు
                  * Note : సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2016 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన  తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గత సంవత్సరం DTA/DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad)  తిరిగి పొందవచ్చు. 

80సీ కింద ప‌న్ను మిన‌హాయింపులు ఏవి?

                      సెక్షన్‌ 80-సీ కింద కొన్ని రకాల పెట్టుబడులు, విరాళాలకు మినహాయింపు ఉంది. పీఎఫ్‌, పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు, కిసాన్‌ వికాస పత్రాలు, ఈఎల్‌ఎస్‌ఎస్‌... మొదలైనవి.                         
                   ప‌న్ను సంక్ర‌మించే ఆదాయం ఉంటే ఎలాగైన ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేయాల్సిందే. అయితే ఎవ‌రికైనా త‌క్కువ ప‌న్ను క‌డితే మేలు అనే అభిప్రాయం ఉంటుంది. అందుకోస‌మే ఐటీ చ‌ట్టంలో మిన‌హాయింపుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. సెక్షన్‌ 80-సీ కింద కొన్ని రకాల పెట్టుబడులు, విరాళాలకు మినహాయింపు ఉంది. పీఎఫ్‌, పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు, కిసాన్‌ వికాస పత్రాలు, ఈఎల్‌ఎస్‌ఎస్‌... మొదలైనవి. ప్రస్తుతం ఈ మినహాయింపు ద్వారా రూ.1,50,000 ఆదా చేసుకోవ‌చ్చు. అవేంటో తెలుసుకుందాం. 
1. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్, వాలంట‌రీ ప్రావిడెంట్ ఫండ్
                       ఉద్యోగ‌స్తులు భవిష్య నిధి(ఈపీఎఫ్‌) కోసం ప్ర‌తి నెలా చందా చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిర్ణీత శాతం కట్టడంతోపాటు... కావాలంటే స్వచ్చందంగా తన వంతు అదనంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మొత్తాలకు సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఉంది. ఈపీఎఫ్, వీపీఎఫ్ రూపంలో రూ.1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.4 లక్షల వరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు. మీకు వేరే ఇత‌ర ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు లేన‌ప్పుడే వాలంట‌రీ ప్రావిడెంట్ ఫండ్ ఎంచుకోవ‌డం మంచిది. 
2. పీపీఎఫ్ 
                           కేవ‌లం ఉద్యోగ‌స్తులే కాకుండా సంపాదించే వారెవ‌రైనా పీపీఎఫ్ ద్వారా ప‌న్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది. సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం పీపీఎఫ్ మార్గంలో రూ. 1,50,000 వ‌ర‌కూ పెట్టే పెట్టుబ‌డుల‌కు ప‌న్ను మిన‌హాయింపు క‌ల‌దు. 
సాధార‌ణంగా పీపీఎఫ్ మార్గంలో పెట్టుబ‌డి పెడితే 15 ఏళ్ల వ‌ర‌కూ వెన‌క్కు తీసుకోవ‌డానికి ఉండ‌దు. అయితే కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలుంటే 7వ సంవ‌త్స‌రం నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమతిస్తారు.
3. జీవిత బీమా ప్రీమియంలు 
జీవిత బీమా ప్రీమియంల‌కు సంబంధించి సంపాద‌న ప‌రుడు లేదా జీవిత భాగ‌స్వామి లేదా వారి పిల్ల‌ల‌కై చెల్లించే సొమ్ముకు 80సీ కింద మిన‌హాయింపు సౌల‌భ్యం ఉంది. త‌ల్లిదండ్రుల‌కై చెల్లించే జీవిత బీమా ప్రీమియంల‌పై మిన‌హాయింపుకు అవ‌కాశం లేదు. ఒక‌టి కంటే ఎక్కువ పాల‌సీలు ఉన్న‌ప్ప‌టికీ అన్నింటికీ మిన‌హాయింపు సౌక‌ర్యం క‌ల‌దు.
4. ఈఎల్ఎస్ఎస్
           మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ప‌న్ను ఆదా సౌక‌ర్యం క‌ల్పించేవి కొన్ని ఉన్నాయి. వాటినే ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు(ఈఎల్ఎస్ఎస్) అంటారు. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబ‌డుల‌కు సంబంధించినంత‌ వ‌ర‌కూ ఐటీ చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద రూ.1,50,000 వ‌ర‌కూ మిన‌హాయింపుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ పొదుపు ప‌థ‌కాల‌న్ని 3 ఏళ్ల లాకిన్ పీరియ‌డ్ ఉంటుంది. 

5. గృహ రుణ చెల్లింపు 
          గృహ రుణం విష‌యంలో రెండు ముఖ్య‌మైన‌వి ఉంటాయి. ఒక‌టి అస‌లు, రెండోది వ‌డ్డీ. కేవ‌లం అస‌లుకు మాత్రం సెక్షన్ 80సీ కింద మినహాయింపు సౌల‌భ్యం ఉంటుంది. వ‌డ్డీకి సైతం సెక్ష‌న్ 80ఈఈ, సెక్ష‌న్ 24 కింద మిన‌హాయింపు పొందే అవకాశం ఉంది. వడ్డీ మొత్తం రూ.50వేల వరకూ ఈ సెక్షన్‌ కింద మినహాయింపు కోరవచ్చు.
6. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా 
ఈ ప‌థ‌కం కింద మీ కూతురి పేరిట ఖాతాను తెరిచి మిన‌హాయింపు కోర‌వ‌చ్చు. సెక్ష‌న్ 80సీ కింద గ‌రిష్టంగా ఎంత వ‌ర‌కైనా పెట్టుబ‌డులు పెట్టుకోవ‌చ్చు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీస డిపాజిట్ రూ.1000 నుంచి గ‌రిష్టంగా రూ.150,000 వ‌ర‌కూ చేయ‌వ‌చ్చు.  సెక్ష‌న్ 80సీ కింద రూ.1,50,000 వ‌ర‌కూ మిన‌హాయింపు కోర‌వ‌చ్చు. 

7. జాతీయ పొదుపు ప‌త్రాలు(ఎన్ఎస్‌సీ)
జాతీయ పొదుపు ప‌త్రాల‌కు 5 ఏళ్ల మెచ్యూరిటీ కాల‌ప‌రిమితి ఉంటుంది. క‌నిష్టంగా రూ.100 నుంచి మొద‌లుకొని గ‌రిష్టంగా ఎంత వ‌ర‌కైనా పెట్టుబ‌డులు పెట్టొచ్చు. ఎన్ఎస్‌సీలో పెట్టే పెట్టుబ‌డి సొమ్ముకు 80సీ కింద మిన‌హాయింపు ఉంటుంది. దీనిపై వ‌డ్డీని ఆరు నెల‌కొక‌సారి చ‌క్ర‌వ‌డ్డీ రూపంలో లెక్కిస్తారు. వ‌డ్డీకి ప‌న్ను ఉంటుంది. 

8. 5 ఏళ్ల డిపాజిట్లు 
5 ఏళ్ల పోస్టాఫీసు డిపాజిట్ల‌కు సైతం ట్యాక్స్ మిన‌హాయింపు ఉంది. 5 ఏళ్ల పోస్టాఫీసు డిపాజిట్లు ఏ త‌పాలా శాఖ కార్యాల‌యంలోనైనా తెర‌వొచ్చు. ఇవి ఇత‌ర ఫిక్స్‌డ్ డిపాజిట్ల లానే ప‌నిచేస్తాయి. అయితే 5 ఏళ్ల క‌చ్చిత‌మైన లాకిన్ పీరియ‌డ్ ఉండ‌దు. పెట్టుబ‌డికి రెండింత‌ల రాబడితో పాటు ప‌న్ను మినహాయింపు సౌక‌ర్యం ఉండ‌టం వీటి ప్ర‌త్యేక‌తం. ఈ పోస్టాఫీసు డిపాజిట్ల‌తో పాటు, బ్యాంకుల్లో చేసే 5 ఏళ్ల ఎఫ్‌డీల‌కు సైతం 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. 

9. పిల్ల‌ల చ‌దువు ఫీజులు: 
త‌ల్లిదండ్రులు ఎప్పుడూ పిల్ల‌ల‌కు మంచి చదువును ఇవ్వాల‌ని కోరుకుంటారు. ఇప్పుడు చ‌దువులు ఖ‌రీదైపోయాయి. ఈ క్ర‌మంలో పిల్ల‌ల పాఠ‌శాల, క‌ళాశాల ఫీజులు ల‌క్ష‌ల్లో చెల్లిస్తున్నారు. అయితే ట్యూష‌న్ ఫీజుకు సంబంధించి ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొన్ని మిన‌హాయింపుల‌కు అవ‌కాశం క‌ల్పించింది. సెక్ష‌న్ 80సీ కింద మీరు ప‌న్ను మిన‌హాయంపుల‌ను క్లెయిం చేసుకోవ‌చ్చు. 

10. ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ బాండ్లు
ఇన్‌ఫ్రా బాండ్ల‌గా అంద‌రికీ తెలిసిన వీటిలో చేసే పెట్టుబ‌డుల‌కూ సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. గ‌తంలో 2010-11, 2011-12 సంవ‌త్స‌రాల్లో ప్ర‌భుత్వ అనుమ‌తితో మౌలిక వ‌స‌తుల రంగంలోని కంపెనీలు వీటిని ప్ర‌వేశ‌పెట్టాయి. 80సీ కింద వీటిపై ల‌భించే ప‌న్ను మిన‌హాయింపుతో పాటు , మొత్తం స్థూల ఆదాయంలో భాగంగా ఈ బాండ్ల‌పై రూ.20 వేల వ‌ర‌కూ సెక్ష‌న్ 80సీసీఎఫ్ కింద మిన‌హాయింపుకు అర్హ‌త క‌ల‌దు. 

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:

పన్ను వర్తించే ఆదాయం రూ.2,50,000 కన్నా ఎక్కువ ఉన్న వారు జులై 31 లోగా
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది.

ఫిబ్రవరి మాసంలో సమర్పించిన ఫారం 16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాలి.


 దాఖలు చేయవలసిన విధానం:

వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందుచున్న వారు, పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పోన్స్య్ వారూ, ఒకే గృహం ద్వారా ఆదాయం ఉన్న వారు ITR-1(సహజ్) ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి.

ఆన్ లైన్ ద్వారా "ఇ- రిటర్న్" ను సులభంగా దాఖలు చేయ వచ్చు. దాఖలు చేసే విధానాన్ని పరిశీలిద్దాం.

 పేరు రిజిస్టర్ చేసుకొనుట:

incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి Register your self అను ఆప్సన్ ను ఎంచుకొనవలెను. దానిలో పాస్ వర్డ్ తదితర వివరములను పూర్తిచేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత మొబైల్ కి వచ్చిన పిన్ నంబర్ ను నమోదు చేస్తే రెజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే. మీ పాస్ వర్డ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

 ఫారం 26 AS:

ఇ- ఫైలింగ్ చేసేందుకు ఫారం 26 AS ను పరిశీలించుకోవాలి. పైన తెలిపిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తదుపరి 'VIEW FORM 26 AS' ను ఎంచు కోవాలి. దానిలో యూజర్ ID అంటే పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్ వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు అయినదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ- రిటర్న్ చేయాలి.

 ఫారం 26 AS లో నమోదుల పరిశీలన:

ఫారం 26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు కానట్లయితే DDO కు తెలియజేయాలి. సక్రమంగా నమోదు కాక పోవడానికి కారణాలు DDO త్రై మాసిక రిటర్న్(Q1, Q2, Q3, Q4) లను సమర్పించక పోవడం లేదా సమర్పించిన వానిలో పొరబాటు జరగడం అయివుండ వచ్చు. త్రైమాసిక రిటర్న్ దాఖలు చేయవలసిన బాధ్యత DDO లదే కాబట్టి వారే దాఖలు చేయడం లేదా తప్పులను సవరించడం చేయవలసి ఉంటుంది.

 ఇ- ఫైలింగ్ చేయడం:

ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ- ఫైలింగ్ చేయడం ప్రారంభించాలి. ముందు చెప్పిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత 'Quick e file ITR- 4S' ఎంపిక చేసుకోవాలి.

PAN నంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీతడితర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇష్టం అయితే నమోదు చేయవచ్చు లేదా తదుపరి అని పేర్కొన వచ్చు.

అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR-1) అసెస్ మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసు కోవాలి. తరువాత ఇవ్వబడిన 3 ఆప్షన్ లు 1) పాన్ ఆధారంగా 2) గతంలో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3) నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి.
తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు, పన్ను వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, 80 G వివరాలు నమోదు చేయాలి. నమోదులు ఎప్పటి కప్పుడు సేవ్ చేసుకొంటే మంచిది. అన్ని నమోదులు పూర్తి అయిన తరువాత సబ్ మిట్ చేయాలి. 26 AS లో నమోదు అయిన పన్ను, ఇ- ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి. లేనట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.


 ఎకనాలెడ్జ్మెంట్:
ITR- 1 సబ్ మిట్ చేసిన తరువాత ఎకనాలెడ్జ్మెంట్ ఆప్షన్స్ వస్తాయి. దానిలో 'NO CVC' అనే ఆప్షన్ ఎంపిక చేసుకొని తదుపరి వచ్చిన ఆప్షన్స్ లో 'Mobile OTP' ఆప్షన్ ఎంపిక చేసుకుంటే మన ఫోన్ కి, మెయిల్ కి OTP వస్తుంది. ఆ పాస్ వర్డ్ ని నమోదు చేస్తే ఎకనాలెడ్జ్మెంట్ మన మెయిల్ కి వస్తుంది. దాని నుండి ఎకనాలెడ్జ్మెంట్ డౌన్ లోడ్ చేసుకొని భద్ర పరచు కోవాలి. ఎకనాలెడ్జ్మెంట్ సీపిసి బెంగుళూరుకు పంప వలసినదీ, లేనిదీ ఎకనాలెడ్జ్మెంట్ క్రింది భాగంలో పేర్కొన బడుతుంది. పంప వలసి వస్తే సంతకం చేసి 3 నెలల లోపు పంపాలి.

ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేసేట‌ప్పుడు దొర్లే త‌ప్పులు

(IT Returns)ఐటీ రిట‌ర్నులు: ఈ విష‌యాల్లో జాగ్ర‌త్త‌!
ఆదాయ‌పు ప‌న్నులు చెల్లించే వారంతా ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేయ‌డం ముఖ్యం. మీరు స‌మ‌యానికి స‌రైన ప‌న్ను చెల్లించిన‌ప్ప‌టికీ పెనాల్టీలు ప‌డ‌కూడ‌దంటే ప‌న్ను రిట‌ర్నుల‌ను మాత్రం గ‌డువు లోపు స‌మ‌ర్పించాలి. మొద‌టిసారి రిట‌ర్నులు ఫైల్ చేయ‌డానికి సిద్ద‌మైన‌వారికి కాస్త భ‌యంగా ఉన్నా, ఏదో కాస్త స‌రికొత్త అనుభూతి కూడా ఉంటుంది. ఐటీ రిట‌ర్నుల‌కు గ‌డువు తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరించాల‌ని గుర్తుంచుకోవాలి. మీరు ఇప్ప‌టికీ రిట‌ర్నులు ఫైల్ చేయ‌క‌పోతే ఏ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాలో తెలుసుకుందాం. 

వ్య‌క్తిగ‌త వివ‌రాలు
ప‌న్ను చెల్లింపుదార్లు వ్య‌క్తిగ‌త వివ‌రాలైన పేరు, మొబైల్ నంబ‌ర్, పుట్టిన తేదీ, చిరునామా, మెయిల్ ఐడీ వంటి వాటిని న‌మోదు చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించాలి. ఈ వివ‌రాలు పాన్ కార్డులో ఉన్న‌దాంతో స‌రిపోలేలా ఉండేట్లు చూసుకోవాలి 


బ్యాంకు ఖాతా వివ‌రాలు
బ్యాంకు ఖాతా వివ‌రాలు త‌ప్పులేకుండా ఇవ్వండి. ఇంకా ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంకు పేరు వంటివి క‌రెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. ఇది మీ రిట‌ర్నుల‌ను సాఫీగా జ‌రిగేలా చేస్తుంది. అంతేకాకుండా మీ బ్యాంకు ఖాతాల‌న్నింటినీ ఐటీ శాఖ‌కు తెలియ‌ప‌ర‌చాలి. ఇటీవ‌ల అన్ని బ్యాంకులు ఆయా ఖాతాల‌ను ఆధార్ అనుసంధానం చేయాల్సిందిగా కోరుతున్న సంగ‌తి తెలిసిందే. 


ఇత‌ర ఆదాయాలు 
మీరు ఫారం నింపుతున్న‌ప్పుడు మీకు 'Income from other sources' అనే కాలమ్ క‌నిపిస్తుంది. ఇక్క‌డ క్లిక్ చేసి రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ కాకుండా ఇత‌ర ఆదాయాలేవైనా ఉంటే వాటిని ఇక్క‌డ న‌మోదు చేయాలి.
వ‌డ్డీ నుంచి సంక్రమించే ఆదాయం 
ప‌న్ను చెల్లింపుదారులు ఎక్కువ‌గా చేసే పొర‌పాటు .. బ్యాంకు ఎఫ్‌డీ, ఆర్‌డీ, చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు, ఇన్ ఫ్రా బాండ్లు, లేదా ఇత‌ర మార్గాల ద్వారా వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం చూపించ‌క‌పోవ‌డం. సెక్ష‌న్ 80టీటీఏ కింద కేవ‌లం మీకు వ‌డ్డీ ఆదాయం మీద రూ.10 వేల వ‌ర‌కూ మిన‌హాయింపు క‌ల‌దు. 5 ఏళ్ల ఎఫ్‌డీల వంటి వాటి మీద వ‌చ్చే వ‌డ్డీకి ప‌న్ను క‌ట్టాల్సిందే. అంతే కాకుండా పీపీఎఫ్‌, ట్యాక్స్ ఫ్రీ బాండ్లు వంటి వాటికి సంబంధించిన స‌మాచారాన్ని ఐటీ రిట‌ర్నుల్లో చూపాలి 


మైన‌ర్, భాగ‌స్వామి నుంచి వ‌చ్చే ఆదాయం
మైన‌ర్ పిల్ల‌ల పేరిట ఏవైనా పెట్టుబ‌డులు పెట్టి ఉంటే, ఇంకా భాగ‌స్వామికి పెట్టుబ‌డి కోసం డ‌బ్బు ఇచ్చి ఉంటే ఆ త‌ర‌హా పెట్టుబ‌డుల‌పై వ‌చ్చిన ఆదాయం వివ‌రాల‌ను సైతం ఐటీ రిట‌ర్నుల్లో చూపాలి. మీకు ఒక‌టి కంటే ఎక్కువ ఇళ్లు ఉండి.. దాని ద్వారా ఆదాయం సంక్ర‌మిస్తున్న‌ట్లైతే మొత్తం ఆదాయాల్లో దాన్ని చూపాలి 


చెల్లించే ప‌న్ను లేకున్నా
వేత‌నంలో టీడీఎస్ కోత లేద‌ని చెప్పి కొంత మంది ప‌న్ను చెల్లింపుదార్లు ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేయ‌రు. అది నిజం కాదు. మీ ఆదాయం రూ.2.5 ల‌క్ష‌ల‌కు మించితే మీరు రిట‌ర్నులు స‌మ‌ర్పించాల్సిందే. ట్యాక్స్ ల‌య‌బిలిటీ సున్నాగా ఉన్నా కూడా 80సీ కింద మిన‌హాయింపులు వాడుకుని ఉంటే ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేయాలి. 


ఆర్థిక సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో ఉద్యోగం మారి ఉంటే
ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండు కంపెనీల్లో ఉద్యోగం చేసి ఉంటే ముందు ప‌నిచేసిన సంస్థ‌లో వ‌చ్చిన వేత‌న వివ‌రాల‌ను ఇవ్వాలి. ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేసేట‌ప్పుడు ఇప్పుడు వేత‌న వివ‌రాలే కాకుండా పాత‌వి కూడా న‌మోదు చేయాలి. 


ఐటీఆర్ ఫైలింగ్ రివిజ‌న్ 
ఒక‌సారి త‌ప్పులు స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి జాగ్ర‌త్త వ‌హించాలి. ఐటీ రిట‌ర్నులు మొద‌టిసారి ఫైల్ చేసేట‌ప్పుడు ఏవైనా త‌ప్పులు దొర్లిన‌ట్లు గుర్తిస్తే రివైజ్‌డ్ రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించాలి. త‌ప్పుల‌ను స‌రిచేసేలా మీ రివైజ్‌డ్ రిట‌ర్నులు ఉండాలి. 

పాన్ కార్డ్ అంటే ఏమిటి ?
                          పాన్ అంటే పర్మినెంట్ అకౌంట్ నంబర్ . ఈ నంబర్ పది డిజిట్లలో ఉంటుంది. అది కూడా ఆల్ఫా న్యూమరిక్ రూపంలో ఉంటుంది. ఈ నంబర్ ముద్రించిన ప్లాస్టిక్ లామినేటేడ్ కార్డ్ ను ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ అందచేస్తుంది. దీనినే పాన్ కార్డ్ అంటారు. ఇది మీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ సైజ్ లో ఉంటుంది. ఈ కార్డ్ పై మీ వ్యక్తిగత వివరాలు నమోదై ఉంటాయి . అంటే మీ పేరు మీ తండ్రిపేరు ,మీ పుట్టిన రోజుపాన్ నంబర్ మీ సంతకం మరియు మీ ఫోటో ఉంటుంది.పాన్ కార్డ్ పై గల పది ఆల్ఫా న్యూమరిక్ రూపం లో ఉండే అక్షరాలలో మొదటి ఐదు అక్షరాలు ఆంగ్ల అక్షరాలు తర్వాత గల నాలుగు అక్షరాలు సంఖ్యలు మరియు చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది. ఈ పది అక్షరాలను ఐదు భాగాలుగా విభజించడమైనది.
                                
1.మొదటి మూడు అక్షరాలుగా AAA to ZZZ ఉంటాయి ,
2.నాలుగవ అక్షరం పాన్ కార్డ్ హోల్డర్ యొక్క స్థితిని తెలియచేస్తుంది
C- Company .
P - Person
H- HUF(Hindu Undivided Family)
F- Firm .
A - Association of Persons (AOP)
T-AOP (Trust)
 B- Body of Individuals (BOI)
 L-Local Authority .)- Artificial Juridical Person
 G– Government
3.. ఐదవ అక్షరం పాన్ కార్డ్ హోల్డర్ ఇంటి పేరు లోని మొదటి అక్షరంను తెలియచేస్తుంది.
 4. తర్వాత నాలుగు అక్షరాలు అంకెలలో 0001 నుండి 9999 వరకు ఉంటాయి .
 5 .చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది.
 పాన్ కార్డ్ ఎవ్వరికీ అవసరం 
          మీ ఆదాయం ఇన్ కమ్ టాక్స్ చెల్లించే పరిమితిలో కనుక ఉంటే మీరు ఇన్ కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి మీకు పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు మీ ఇన్ కమ్ టాక్స్ రిటర్న్ లో మీ పాన్ కార్డ్ నంబర్ తెలియచేయవలసి ఉంటుంది. అంతే కాకుండా క్రింది సమయాలలో పాన్ కార్డ్ లేదా పాన్ నంబర్ తప్పనిసరి. మీ ఆదాయ పన్ను వ్యవహారాలలోఐటీ డిపార్ట్ మెంట్ తో ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుటకు అన్ని రకాల చలాన్స్ కట్టే సమయంలో డిమ్యాట్ అకౌంట్ ప్రారంభించడానికి ఏదైనా ఆస్థి అమ్మడం లేదా కనుగోలు చేయు సమయంలో కారు కొనే సందర్భంలో యాభై వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపే సమయంలో బ్యాంక్ లో ఖాతా ప్రారంభించడానికి మ్యుచవల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయు సమయంలో యాభై వేల కంటే పైన డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొనుటకు అంతే కాకుండా వివిధ సందర్భాలలో పాన్ కార్డ్ మీ వ్యక్తిగత గుర్తింపు కార్డ్ గా కూడా ఉపయోగపడుతుంది.

TDS అంటే ఏమిటి ?
               TDS అంటే మీరు పొందుతున్న ఆదాయం మూలం వద్దనే ఆదాయపు పన్ను కోత విధించడం .ఒకరకంగా చెప్పాలి అంటే పరోక్షంగా ఆదాయపు పన్ను వసూలు చేయడం . అంటే ఇది pay as you earn అనే పద్దతిలో జరుగుతుంది.
                          సాదారణంగా మీరు ఉద్యోగస్తులతే మీ ఆదాయం పన్ను మినహాయింపు పరిధి కంటే అధికంగా ఉంటే మీ యాజమాన్యం మీ వద్ద TDS వసూలు చేస్తుంది. మీ యాజమాన్యం TDS వసూలు చేసే ముందు మీరు ఆదాయపు పన్ను మినహాయింపు అర్హత గల వాటిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మీ ఆదాయం లో నుండి తగ్గించుకొని మీ ఆదాయానికి వర్తించే స్లాట్స్ కి అనుగుణంగా TDS వసూలు చేస్తారు. కాబట్టి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వివరాలు మీ యాజమాన్యం కు తెలియచేయడం తప్పనిసరి.
                   ఒకవేళ మీరు బ్యాంక్ వడ్డీ ఆదాయం RS 10000 కంటే అధికంగా వడ్డీ పొందితే ,వడ్డీ ఆదాయంలో 10 % TDS రూపంలో మీ వద్ద బ్యాంక్ వసూలు చేస్తుంది. మీకు కేవలం బ్యాంక్ వడ్డీ ఆదాయం మాత్రమే ఉన్న లేదా మీ మొత్తం ఆదాయం పన్ను పరిధి కంటే తక్కువగా ఉంటే మీరు బ్యాంక్ వారికి 15G & 15 H అందచేసి మీ వద్ద TDS వసూలు చేయకుండా చూసుకోవచ్చు.
                            ఆదాయపు పన్ను విషయంలో పెన్షన్ ను కూడా సాలరీగానే పరిగణిస్తారు. ఈ విధంగా వసూలు చేసిన TDS _ను ఆదాయపు పన్ను శాఖ వారికి చెల్లిస్తారు. అదే విధంగా మీకు TDS సర్టిపికేట్ కూడా అందచేస్తారు. మీ దగ్గర TDS వసూలు చేస్తే మీరు TDS సర్టిఫికేట్ తీసుకోవడం మీ భాద్యత అదే విధంగా TDS సర్టిఫికేట్ ఇవ్వడం TDS వసూలు చేసిన వారి బాధ్యత .
                                       TDS కేవలం సాలరీ , బ్యాంక్ వడ్డీ ఆదాయం మాత్రమే కాకుండా మీ ఆదాయం క్రింద ఇవ్వబడిన దానిలో యే విధంగా ఉన్న TDS వసూలు చేస్తారు.