- SUBSCRIBERS SLIP -Guntur Dt.
- All Districts click here
- ZPPF Software updated 12-7-2018 by Nagaraju garu
PREVIOUS INFORMATION
ప్రభుత్వోద్యోగులకు, ప్రొవిన్సలైజేషన్ చేసిన తరువాత జీ.వో. ఎం. ఎస్. నెం. 317, తేదీ : 13-7-1984 ప్రకారం పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు ఈ సదుపాయం కలదు.
1-9-2004 తరువాత ఉద్యోగములో చేరిన వారికి జీపిఎఫ్ సదుపాయం లేదు. జీ.వో.ఎం.ఎస్.నెం. 654, Finance. 22.9.04
రిటైరుమెంటుకు 4 మాసాల ముందు డి.ఎ. ఎరియర్స్ పి. ఎఫ్లో చేర్చనవసరంలేదు. జి.మెమో 020బి 1650. ఎ1/పీసి1/92 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ 5.2.93 జి.పి.యఫ్ నిల్వ నుండి ఈ క్రింది కారణాల వలన అడ్వాన్సు పొంద వచ్చును.
1 చందాదారునికి లేక అతనిపై ఆధారపడిన వారికి దీర్ఘకాలిక వ్యాధి సంభవించినపుడు,
2 సెకండరీ విద్య కంటే పై స్థాయి విద్య యితరదేశము లలో చదువుటకు
3 మనదేశములో 3 సం||ల కంటే మించిన ఉన్నత విద్యా కోర్సులు చదువుటకు,
4 ఉద్యోగి హోదాను బట్టి ఆచార సంబంధమైన , వివాహము, కర్మ, ఉపనయన, జన్మదినోత్సవాలు -నిర్వహించుటకు,
5. తన విధి నిర్వహణలో ఎదురైన కోర్టు ఖర్చులు భరించుటకు, తాత్కాలిక అడ్వాన్సు కనీస రు. 500గానీ,
మూడు నెలలకు మించని వేతనం యిస్తారు. అయితే ఇది నిల్వలో సగం మొత్తానికి మించరాదు.
6 ఈ అడ్వాన్సును అభ్యర్థి కోరుకుంటే తప్ప కనీసం 12 వాయిదాలకు తగ్గకుండా 24 వాయిదాలకు
మించకుండాను వసూలు చేస్తారు.
7. అర్థజీతం కంటే తక్కువ వేతనం పొందే సెలవులలోను, సబ్సిస్టెన్స్ ఎలవెన్సు పొందేకాలంలో ఈ రికవరీలు చేయరు.
8 చివరి వాయిదా తీరకముందే మరో అడ్వాన్సు మంజూరు చేయవచ్చు. బకాయి మొత్తం కూడా కొత్త అడ్వాన్స్తో కలిపి
వాయిదాలను నిర్ణయించి వసూలు చేస్తారు.
పాక్షిక ఉపసంహరణ:-
ఎ) 15 సం|| సర్వీసు పూర్తి అయిన పిదప లేదా రిటైర్మెంట్ పది సంవత్సరములకు ముందు వాటిలో ఏది
ముందు అయితే అప్పుడు ఈ క్రింది అవసరాలకు పాక్షిక ఉప సంహరణ
(పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ చేసుకొనవచ్చును.)
1) గృహ నిర్మాణం లేదా కొనుగోలు సందర్భంగా చేసిన అప్పు తీర్చుటకు..
2) ఇంటి స్థలం కొనుగోలుకు లేదా ఇంటి కొనుగోలుకు చేసిన అప్పు తీర్చుటకు
3) గృహ నిర్మాణానికని కొనుగోలు చేసిన స్థలంలో గృహ నిర్మాణానికి (రూల్ 15(ఎ)
బి) 20 సం|| సర్వీసు పూర్తి అయిన పిదప లేదా రిటైర్ మెంట్ పదేళ్ళ ముందర యిందులో ఏది ముందు అయితే
అప్పుడు క్రింది అవసరాలకు పార్టు ఫైనల్ విత్ డ్రాయల్ చేయవచ్చును.
1. భారతదేశానికి బయట సాంకేతిక లేదా వృత్తి సంబంధమైన ఉన్నత విద్యకు పిల్లలకు పంపుటకు
2. భారతదేశంలోనే మెడికల్, ఇంజనీరింగ్, లేదా సాంకేతిక స్పెషలైజ్డ్ కోర్సులలో పిల్లలను చేర్చుటకు.
3. తన లేదా తన పిల్లల ప్రధానం, పెళ్ళి ఖర్చులు
4.తన లేదా తన కుటుంబ సభ్యుల వైద్య ప్రయో ఖర్చులకు (జి.పీ. ఎఫ్.రూల్ 15)
10) నిల్వ వున్న సొమ్ములో ప్రతి కారణమునకు వేర్వేరు మొత్తాలు నిర్ణయింపబడినవి.
11) ఉద్యోగి సర్వీసు నుండి వైదొలగినా, తొలగించబడినా, పదవీ విరమణ చేసినా జి.పి. ఎఫ్ నిల్వ సొమ్ము పూర్తిగా
తీసుకొన వచ్చును.
12 ఉద్యోగి సర్వీసులో వుండగానే విధిగా తన మరణానంతరం జి.పి. ఎఫ్. సొమ్ము ఎవరెవరికి ఎంతెంత మొత్తం
చెందవలెనో ఒకరికిగాని అంతకు మించిగాని నామినేషన్ చేసుకోవాలి. నామినేషన్ యివ్వకుండా చనిపోతే
వారసత్వ హక్కుగల కుటుంబ సభ్యులకు సమాన భాగాలలో చెల్లిస్తారు. అయితే ఈ క్రింది వారికి చెల్లించరు.
1) మేజరయిన కుమారులు లేదా మనమళ్లు.
2) వివాహమైన కుమార్తెలు, మనమరాళ్లు
13) జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యో గుల ఈ నిధిని జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో వుంచారు.
14) జి.పి.ఎఫ్ పై వడ్డీ లెక్కింపు : పిఆర్/100x1/12
15) జూనియర్ లెక్చరర్స్ కు షి. ఎఫ్ అడ్వాన్సు/పార్టు ఫైనల్ విత్ డ్రాయల్ అధికారం ప్రిన్సిపాల్సుకు ఇవ్వబడింది.
Memo. No. 868/IE 1796-2,Edn. dt.6-12-96.
16) ప్రభుత్వ జెడ్ పి హైస్కూళ్ల హెడ్మాష్టర్లకు వారి టీచింగ్ సిబ్బందికి పి.ఎఫ్. అడ్వాన్సు, పార్టు ఫైనల్
పేమెంట్ ఆయా హెచ్ఎంలు చేస్తారు. మండలాలలో ఉపా ధ్యాయులకు ఎం.ఇ.ఓ చేస్తారు.
(జీ.వో.ఎం.ఎస్.నెం. 40 విద్య తేదీ 7.5.2002.మరియు జీ.వో.ఎం.ఎస్.నెం. 447, తేది. 28-11-2013)
17) పదవీ విరమణకు 4 మాసముల ముందు ల జి.పి.యఫీ కు ఎటువంటి జమలు (చందాలు) చెల్లించనక్కర్లేదు.
Rule 1. Cir.Memo. 081436/905 Pen Il/86 Fin&Plg. dt. 31.12.1988.
18) జి.పి.యఫ్ Missing Credit /Sub Account లోయున్ నిల్వలను
1. Missing Credit Proforma
2. జిపిఎఫ్ షెడ్యూల్డు
3. DDO/HM/MEO, Letter ,పంపించినట్లయితే
Missing Credit సరిదిద్దబడును.
19) 1-9-2004 తరువాత రెగ్యులర్ అయిన ఉపాధ్యాయులకు 2002 డి.ఎస్.సి.లో ఎంపిక కాబడిన
ఉపాధ్యాయులకు జి.పి.ఎఫ్. అకౌంట్స్ తెరవడానికి అవకాశము కల్పించబడినది.
పి.ఎఫ్., బూస్టర్ స్కీం:
సర్వీసులో ఉండగా మరణించిన ఉపాధ్యాయుని నామినీ లకు, వారసులకు యీ పథకం వలన ఆర్థిక లాభం ఉంటుంది. మరణించిన దినమునకు ముందుగా గల మూడు సంవత్స రములలోగల సగటునెల నిలువలు రూ.3,000/-లకు గజిటెడ్ ఉపాధ్యాయులైతే రూ. 4,000 లకు తక్కువగాకుండా సరాసరి నెల నిలువకు రెండింతలు రూ. 10,000/- మించ కుండా చెల్లిస్తారు. (జీ.వో. ఎం. ఎస్. నెం., 425, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ తేది. 28.9.76)
ఈ సౌకర్యం పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు గవర్నమెంట్ మెమో నెం. 56418/అకౌంట్స్ 1/87-3 పి.ఆర్. తేది 15.4.88 ద్వారా వర్తింప చేయబడింది. జి.ఓ. ఎం. ఎస్. నెం. 54, పంచాయితీ రాజ్ అండ్ ఆర్. డి. తేదీ 28.1.1995 ద్వారా బూస్టర్ స్కీం చెల్లింపుల పద్దతి వివరించటమైనది. జి.వో. ఎం. ఎస్. నెం. 386 పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (అకౌంట్స్-1)
డిపార్టుమెంటు తేదీ 17.9.1996 ప్రకారం పంచాయితీరాజ్ ఉద్యోగులకు బూస్టర్ స్కీం క్రింద చెల్లింపులు వెంటనే చేసి * Govt.కు రాసి రీ ఎంబర్ మెంట్ జిల్లా పరిషత్లు పొందాలని వివరించటమైనది
సందేహాలు - సమాధానాలు :-
1. ZPPF లోన్ తిరిగి చెల్లించకుండా ఉండాలంటే ఉద్యోగికి ఎంత సర్వీసు ఉండాలి?
జవాబు: 20 ఇయర్స్ సర్వీసు నిండితే లోన్ అమౌంట్ తిరిగి చెల్లించవలసిన అవసరం ఉండదు. అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో మరియు ఇంటి కన్స్ట్రక్షన్ సగంలో ఆగిపోయిన సందర్భంలో సరియైన పత్రాల ఆధారంగా 15 ఇయర్స్ సర్వీసు నిండిన ఉద్యోగి కూడా లోన్ తిరిగి చెల్లించకుండా ఉండవచ్చు.
2: PF ఋణం ఎంత ఇస్తారు?తిరిగి ఎలా చెల్లించాలి?
జవాబు: PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.
3. PF గరిష్టంగా ఎంత పెంచవచ్చు. ఎన్ని సార్లు పెంచవచ్చు?
జవాబు: జీఓ.326 ; ఆర్థిక ; తేదీ:21.12.88 ప్రకారం PF చందా గరిష్టంగా పే+డీఏ కి మించకుండా ఉండాలి. జీఓ.21 ; ఆర్ధిక; తేదీ:24.1.81 ప్రకారం PF ప్రీమియం సంవత్సరం లో రెండు సార్లు పెంచుకోవచ్చు.ఒక్కసారి తగ్గించుకోవచ్చు.
4. 17 ఇయర్స్ సర్వీస్ గల టీచర్ వైద్య కారణం పై PF లోను తీసుకున్నాడు.6 నెలలు గడిచింది.గృహ నిర్మాణం నిమిత్తం పార్ట్ ఫైనల్ తీసుకోవటానికి వీలుందా?
జవాబు: మీ మొత్తాన్ని పార్ట్ ఫైనల్ కింద మార్చుకొని మాత్రమే 6 నెలల తరువాత పార్ట్ ఫైనల్ పొందే అవకాశం ఉంది.
5: నేను PF నుండి ఋణం పొందియున్నాను.వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??
జవాబు: ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.
6: ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)లో నుంచి మన అత్యవసరాలకు దాచుకున్న మొత్తంలో కొంత వెనక్కి లేదా అప్పుగా తీసుకవచ్చు కదా! జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో ఇలా తీసు కోవడం వీలవుతుందా? పదవీ విరమణ, అత్యవసరాలకు సంబంధించి ఈ రెండింటిలో ఏది మెరుగైనది?
జవాబు: దీర్ఘకాలిక అవసరాల కంటే తక్షణ అవసరాలు, కోరికలు, కలల కోసం ఖర్చు పెట్టాలని చూడటం మానవ బలహీనత. పదవీ విరమణ చేశాక పింఛను అత్యవసరం. పింఛను కోసం మొదలు పెట్టిన దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడులను మధ్యలో తీసుకోకూడదనే లక్ష్యంతో ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో మొత్తాన్ని మధ్యలో వెనక్కి తీసుకోకూడదనే నిబంధన విధించారు. ఇటీవల దీన్ని కొంత సడలించారు. పిల్లల చదువు, పెళ్లి, ఇంటి నిర్మాణం, గుండెపోటు, పక్షవాతం, ప్రమాదం వంటి ఆరోగ్య అవసరాలకు మన ఎన్పీఎస్ నిల్వలో 25శాతం వెనక్కి తీసుకోవచ్చు.ఎన్పీఎస్ ప్రారంభించిన మూడేళ్ల తర్వాత ఈ సదుపాయం లభిస్తుంది. పదవీ విరమణ చేసేలోగా మూడుసార్లు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. పీపీఎఫ్‌లో వడ్డీ జనవరి నుంచి 7.6శాతం. ఎన్పీఎస్ టైర్-1 ఈక్విటీలో గత ఐదేళ్ల రాబడి 14శాతం వరకూ ఉంది.ఇందులో ప్రభుత్వ బాండ్ పథకంలో కూడా రాబడి 8.47% పైగానే ఉంది. సెక్షన్80సీ కింద రూ.1,50,000 పెట్టుబడి పెట్టి, అదనంగా మరో రూ.50వేల పెట్టుబడి వరకూ ఎన్పీఎస్లో మదుపు చేసి, ఆదాయపు పన్ను రాయితీ పొందవచ్చు. కాబట్టి, మీరు ఎన్పీఎస్ ఎంచుకోవచ్చు
ZP PF_*
* GO.326 ప్రకారం PF ను గరిష్ట0 గా BP+DA ఫై 12% వరకు పెంచవచ్చు._*
* GO,21 ప్రకారం PF ను ఆర్దిక సంవత్సరం లో రెండు సార్లు పెంచుకోవచ్చు.ఒక సారి తగ్గించు కోవచ్చు.
* 20 సంవత్సరము ల లోపు సర్వీస్ కలవారు బేసిక్ పే కు 3 రెట్లు లేదా వారి నిల్వ లో సగం కు మించకుండా చదువు, వైద్యం, వివాహం, కోర్టు ఖర్చుల నిమిత్తం లోను పొంద వచ్చు.దీనిని వాయిదాల పద్దతి లో తిరిగి చెల్లించాలి_*.
*20ఇయర్స్ సర్వీసు పైన కలవారు వారి ఖాతా నుండి బేసిక్ పే కు 6 రెట్లు లేదా నిల్వ లో సగానికి మించకుండా చదువు, వివాహం, వైద్యం, ఇంటి నిర్మాణం కొరకు లోన్ పొందవచ్చు.దీనిని తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు_*.
* రిటైర్మెంట్ కు 4 నెలల ముందు ప్రీమియం నిలిపి వేయాలి. రిటైర్మెంట్ తరువాత వడ్డీ తో సహా చెల్లిస్తారు.
*1.9.2004 తరువాత ఉద్యోగం లో చేరిన వారికి PF సౌకర్యం లేదు.